Pak Leaders Fight On TV Debate: టీవీ చానెల్‌ డిబెట్‌ లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నేతలు.. వీడియో వైరల్‌

టీవీ చానెల్‌ డిబెట్‌ లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నేతలు.. వీడియో వైరల్‌

మన దగ్గర అనే కాదు.. ఎక్కడైనా సరే టీవీ చానెల్‌ డీబేట్లు.. ఎంత వాడివేడిగా జరుగతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల యుద్ధం సాగుతుంటుంది. ఇక కొన్ని సార్లు పరిస్థితి అదుపు తప్పి.. ఏకంగా కొట్టుకునే దాకా వెళ్తుంది. తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది. టీవీ చానెల్‌ డిబెట్‌ లైవ్‌లో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కాస్త పెరిగి పెద్దదయ్యి.. చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది. లైవ్‌లోనే ఇద్దరు నేతలు ఒకరి మీద పిడిగుద్దులు కురిపించుకున్నారు. సదరు టీవీ చానెల్‌ సిబ్బంది, యాంకర్‌ వెళ్లి అత్యంత కష్టంగా వారిని విడిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..

ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం దాయాది దేశంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్థిక మాంద్యంతో ఆ దేశం సతమతమవుతుంది. రూపాయి విలువ పడిపోవడంతో.. నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్‌కు చెందిన టీవీ చానెల్‌ ఒకటి.. ప్రస్తుత పరిస్థితులు, అవి ఏర్పడటానికి కారకులు ఎవరు అనే దాని మీద డిబేట్‌ నిర్వహించింది.

ఈ డిబేట్‌కి పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ లాయర్‌ షేర్‌ అఫ్జల్‌ మార్వాట్‌తో పాటు.. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ పీఎమ్‌ఎల్‌ పార్టీ సెనెటర్‌ అఫ్నాన్‌ ఉల్లా ఖాన్‌ హాజరయ్యారు. రెండు రోజుల క్రితం అనగా సెప్టెంబర్‌ 27న జరిగిన టీవీ చానెల్‌ డిబేట్‌లో షేర్‌ అఫ్జల్‌తో పాటు.. అఫ్నాన్‌ ఉల్లా ఖాన్‌లు పాల్గొన్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. ఇక గొడవ ఎక్కడ ప్రారంభం అయ్యింది అంటే.. అఫ్నాన్‌ మాట్లాడుతూ.. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ యూదుల ఏజెంట్‌ అని.. అతడు పాక్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేశాడని ఆరోపించారు.

ఈ మాటలతో అఫ్జల్‌కు కోపం వచ్చింది. అంతవరకు కేవలం ఇరువురి మధ్య మాటల యుద్ధం మాత్రమే జరగ్గా.. ఆ తర్వాత ఇరువురు నేతలు తమ చేతులకు పని చెప్పారు. టీవీ డిబెట్‌ లైవ్‌లోనే ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

Show comments