పాక్‌ ఎందుకింత దిగజారిపోయింది? ఆ రోజు నుంచే వారి పతనం మొదలైందా?

Pakistan, ENG vs PAK, T20 World Cup 2021, Shaheen Afridi, Cricket News: పాకిస్థాన్‌ ఓ పసికూన టీమ్‌లా మారుతోంది. అయితే వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Pakistan, ENG vs PAK, T20 World Cup 2021, Shaheen Afridi, Cricket News: పాకిస్థాన్‌ ఓ పసికూన టీమ్‌లా మారుతోంది. అయితే వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పాకిస్థాన్‌ క్రికెట్‌కు ఏమైంది? మరీ ఇంత అధ్వానంగా ఆడుతున్నారేంటి?.. పాక్‌ను నిత్యం ద్వేషించే కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు కూడా పాక్‌ ఆట చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలేమైంది వీళ్లు.. రోజు రోజుకు పసికూన కంటే దారుణంగా తయారుతున్నారంటూ ఒక రకంగా వారిపై జాలి చూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ప్రదర్శన చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది మరి. అంత దారుణంగా ఆడుతున్నారు పాక్‌ ఆటగాళ్లు. తాజాగా సొంత గడ్డపై పాకిస్థాన్‌ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. క్రికెట్‌ చరిత్రలోనే అలాంటి ఓటమిని మరే జట్టు కూడా చవిచూడలేదు. పైగా హోం పిచ్‌లో ఇంత ఘోర ఓటమి అంటే.. ఒక విధంగా పాకిస్థాన్‌ పరువు పోయినట్లే లెక్క. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 500లకి పైగా పరుగులు చేసి.. ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో ప్రస్తుతం పాక్‌ టీమ్‌పై ఆ దేశ క్రికెట్‌ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.

గత కొన్నేళ్లు పాకిస్థాన్‌ ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. జింబాబ్వే, యూఎస్‌ఏ, ఆఫ్ఘనిస్థాన్‌ లాంటి పసికూనల చేతుల్లో కూడా ఓడిపోతూ వస్తోంది. 2021 నుంచి పాకిస్థాన్‌ జట్టు పతనం మొదలైనట్లు కనిపిస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీలోని పాకిస్థాన్‌ జట్టు ఫైనల్‌ ఆడింది. ఆ తర్వాత నుంచి.. అన్ని ఓటములే. ఏ పెద్ద టోర్నీలో కూడా మంచి ప్రదర్శన కనబర్చలేదు. విదేశాల్లోనే కాదు.. స్వదేశంలో కూడా టెస్ట్‌ సిరీస్‌లో ఓడిపోతూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్‌కు పట్టిన ఈ దుస్థితికి కారణం.. ఓ సంఘటన అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అదేంటంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మంచి ప్రదర్శన కనబర్చి గెలిచింది. ఆ మ్యాచ్‌లో పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ సూపర్‌ బౌలింగ్‌తో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లను వెంటవెంటనే అవుట్‌ చేశాడు.

ఆ తర్వాత.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీని కూడా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత పాక్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌ వికెట్‌ కో​ల్పోకుండా 152 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసి.. 10 వికెట్ల తేడాతో జట్టుకు అద్భుత విజయం అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ, ఆ మ్యాచ్‌లో షాహీన్‌ షా అఫ్రిదీ చేసిన ఓవర్‌ యాక్షనే ఇప్పుడు పాక్‌కు పాపం చుట్టుకున్నట్లు చుట్టుకుందని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌, రాహుల్‌, కోహ్లీలను అవుట్‌ చేసిన ఆనందంలో షాహీన్‌ అఫ్రిదీ బౌండరీ లైన్‌ వద్ద వాళ్లు ఏ షాట్‌ ఆడి అవుట్‌ అయ్యారో.. ఆ షాట్లను ఇమిటేట్‌ చేస్తూ.. కాస్త షో ఆఫ్‌ చేశాడు. అది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఆ తర్వాత.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో విరాట్‌ కోహ్లీ 82 పరుగుల సూపర్‌ ఇన్నింగ్స్‌కు పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాడు. అయితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో షాహీన్‌ అఫ్రిదీ.. భారత్‌ స్టార్‌ బ్యాటర్లను వెక్కిరించినప్పుటి నుంచి.. విజయం పాక్‌ను వెక్కిరిస్తూ వస్తోంది. అప్పటి నుంచే పాకిస్థాన్‌ పతనం మొదలైందని.. ప్రముఖ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బర్గ్‌ కూడా అభిప్రాయపడ్డాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments