ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లి కుదరడం లేదా.. కార్తీక ఏకాదశి రోజున ఇలా చేయండి

దేశంలో బ్రాహ్మచారుల సంఖ్య పెరిగిపోతుంది. ఆడ పిల్లలు కూడా త్వరగా పెళ్లి చేసుకోవడం లేదు. చదువులు, ఉద్యోగం అంటూ సుమారు 30 దాటేక పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు. దీంతో అబ్బాయికి తగ్గ.. అమ్మాయి.. వధువు తగ్గ వరుడు దొరకడం కష్టంగా మారింది.

దేశంలో బ్రాహ్మచారుల సంఖ్య పెరిగిపోతుంది. ఆడ పిల్లలు కూడా త్వరగా పెళ్లి చేసుకోవడం లేదు. చదువులు, ఉద్యోగం అంటూ సుమారు 30 దాటేక పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు. దీంతో అబ్బాయికి తగ్గ.. అమ్మాయి.. వధువు తగ్గ వరుడు దొరకడం కష్టంగా మారింది.

ఇటీవల కాలంలో పెళ్లి కాని వారి  సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. పెళ్లెప్పుడవుతుంది బాబు నీకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు అని వెయిట్ చేస్తూనే ఉన్నారు.. వెతుకుతూనే ఉన్నారు అబ్బాయిలు. ఆడ పిల్లల.. అంచనాలు, ఆలోచనలు.. ఆ పిల్ల తల్లిదండ్రులకు పెడుతున్న ఆంక్షలతో విసిగి చెందుతున్నారు అబ్బాయిలు. ఎక్కడో గంతకు తగ్గ బొంత దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ.. 30 ఏళ్లు గడిపేస్తున్నారు. అమ్మాయిలు కూడా చదువు సంధ్యా అంటూ 30 ఏళ్ల వరకు గడిపేస్తున్నారు.  దీంతో పెళ్లీడు వచ్చే సరికి సరైన సంబంధాలు దొరకడం లేదు. పప్పన్నం పెట్టేదెప్పుడు అనే ప్రశ్నలు బంధువుల నుండి ఎదుర్కొంటూనే ఉన్నారు. కొంత మందికి జాతక దోషం, ఇతర సమస్యల కారణంగా వివాహాలు కావడం లేదు.  సమస్య ఏదైనా పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలకు  ఓ చక్కని పరిష్కారం ఉంది ఈ కార్తీక మాసాన.

అన్ని మాసాల్లో కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉన్న సంగతి తెలిసిందే. ముల్లోకాలను పాలించే త్రిమూర్తులకు ఇష్టమైన నెల కూడా ఇదే కావడం విశేషం. కార్తీక మాసం ఆసాంతం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఈ నెలలో వచ్చే కార్తీక పున్నమి, ఏకాదశికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఏకాదశి రోజు.. పెళ్లి కావడం లేదని, సంబంధాలు చివరి వరకు వచ్చి.. ఆగిపోతున్నాయి అనుకునే అమ్మాయిలు/అబ్బాయిలు ఈ పనులు చేస్తే పెళ్లి గడియలు వస్తాయని నమ్ముతుంటారు. కార్తీక మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణు నాలుగు నెలల పాటు యోగ నిద్ర నుండి మేల్కొంటారట. ఈ సమయంలో పూజలు చేస్తే నేరుగా ఆ భగవానుడికి చేరుకుంటాయట. అందుకే ఏకాదశి తర్వాత నుండి పెళ్లిళ్లు, శుభకార్యాలు చేస్తుంటారు. ఇదే రోజున పెళ్లి కాని వారు ఈ విధంగా చేస్తే వివాహం ఖాయమని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం చేసి.. ధ్యానం పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత భగవాన్ విష్ణు ఆరాధన చేయాలి. కుంకుమ, పసుపు, చందనంతో ఆయనకు పూజలు చేయాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. పూజ అనంతరం శ్రీ మహా విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి. ఇలా చేస్తే వివాహం జరుగుతుందని ఉవాచ. అలాగే న్యాయబద్దమైన మంచి కోర్కెలు తీరాలన్నా ఈ రోజు చాలా ప్రాశ్తస్యం. ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు పూజ చేయడం, ఆ చెట్టుకు నీళ్లు పోయడం చేయాలి. ఎందుకంటే.. రావి చెట్టులో మహా విష్ణువు కొలువై ఉంటారని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఆ భగవంతుడు ఆనందం చెంది.. కోరికలు తీరుస్తాడని పురాణాల్లో పేర్కొనబడి ఉంది.

Show comments