ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది సిబ్బంది!

ఇటీవల చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగగా 50 మంది సిబ్బంది చిక్కుకున్నట్టు సమాచారం.

ఇటీవల చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగగా 50 మంది సిబ్బంది చిక్కుకున్నట్టు సమాచారం.

రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఎండల దాటికి జనం అల్లాడిపోతున్నారు. మండు వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటుంటాయి. మానవ తప్పిదాల కారణంగా, టెక్నికల్ సమస్యల కారణంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు వణుకుపుట్టిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఓ కార్ల కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నట్టు సమాచారం.

నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు చెలరేగుతున్నాయి. భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది వరకు సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీల ద్వారా బయటికి దూకుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నిచ్చెనల సాయంతో బాధితులను బయటకు తీసుకువస్తున్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న కొందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కార్యాలయంలో ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments