P Krishna
Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat):గత నెల నుంచి శ్రావణ మాసం మొదలైంది...దేశ వ్యాప్తంగా పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి ప్రారంభమైంది. ఇక బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది.
Todays Gold Rate in Hyderabad (22 & 24 Carat):గత నెల నుంచి శ్రావణ మాసం మొదలైంది...దేశ వ్యాప్తంగా పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందడి ప్రారంభమైంది. ఇక బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది.
P Krishna
ఇటీవల దేశంలో బంగారం కొనుగోలు శాతం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో పాటు పెద్ద పండుగలు వస్తే చాలు మగువలు పసిడి కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం.. దీంతో అందమైన ఆభరణాలు చేస్తారు. ఇక భారతీయ సంప్రదాయాలతో బంగారం ముడిపడి ఉందనే చెప్పాలి. ఇటీవల పసిడి, వెండి ధరలు తరుచూ మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మేలిమి బంగారం రూ.73 వేలకు దాటింది. భవిష్యత్ లో ఇది లక్ష రూపాలయ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో తక్కువ ధర ఉన్నపుడు కొనుగోలు చేస్తే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం కొనుగోలు చేసే మహిళలకు గొప్ప శుభవార్త. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాకపోతే వెండి ధర మాత్రం పెరిగింది. ఇటీవల పసిడి ధరలు ఒకరోజు పెరగడం, ఒక రోజు తగ్గడం జరుగుతూ వచ్చింది. కానీ వారం రోజులుగా వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,66,770 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,72,830కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,770 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,830 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,910 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,980 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,760 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,830 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,760 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.91,000 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.86,100, బెంగుళూరులో రూ.84,100 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.90,100 వద్ద కొనసాగుతుంది.