P Krishna
Today Gold and Silver Rates: గత నెల నుంచి శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
Today Gold and Silver Rates: గత నెల నుంచి శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పసిడి కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.
P Krishna
ఈ నెల మొదటి వారం పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. పండుగలు, పెళ్లిళ్ల సందడి ప్రారంభం కావడంతో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. గత నెల భారీగా తగ్గిపోయిన పుత్తడి ఈ నెల ప్రారంభంలో కూడా ఊరటనిచ్చింది. గత రెండు మూడు రోజుల నుంచి మళ్లీ చుక్కులు చూపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం భారీగానే చూపుస్తున్నాయి. వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతూ షాక్ ఇస్తున్నాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..
దేశ వ్యాప్తంగా కొంతకాలంగా పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఒకటీ రెండు రోజులు మినహాయించి బంగారం ధరల్లో మార్పులు పెద్దగా లేవు.గత ఏడాదితో పోల్చితో ఈ ఏడాది పసిడి ధర దాదాపు రూ.5 వేలకు పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో పుత్తడి ధర రూ.75 వేలకు చేరుకుంది. భవిష్యత్ లో లక్ష దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి, రూ.68,810 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,రూ.75,060 కి చేరింది. ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,810 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.75,060 వద్ద కొనసాగుతుంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,960 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.75,160 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 68,810 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.75,060 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,810 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.75,060 ద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగి రూ.93,100కి చేరింది. చెన్నై, కేరళా, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.98,000 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.93,100, బెంగుళూరులో రూ.86,100వద్ద కొనసాగుతుంది.