Gold and Silver Rates: పసిడి కొనుగోలుదారులకు శుభవార్త..! ఒక్క రోజులోనే భారీ మార్పు.. ఈ రోజు ధర ఎంతంటే?

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త..! ఒక్క రోజులోనే భారీ మార్పు.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates:కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దీనితో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

Gold and Silver Rates:కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దీనితో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా మహిళలు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ మధ్య కాలంలో బంగారం సెక్యూరిటీగా భావిస్తున్నారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి భవిష్యత్ లో ఆపద సమయంలో పనికి వస్తుందని చాలా మంది దీనిపై పెట్టుబడి పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే తరుచూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. తాజాగా బంగారం కోనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త.. పరుగులు పెడుతున్న ధరలకు బ్రేక్ పడింది. మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్చి, ఏప్రిల్ లో మాత్రం చుక్కలు చూపించాయి. ఒకదశలో మేలిమి బంగారం ధరలు 75 వేలు దాటిపోయింది. బంగారం కొనుగోలు చేయానుకునేవారు ధరలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు.. ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో అప్పుడు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వారికి బంపర్ ఆఫర్. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన పసడి ధరలకు బ్రేక్ పడింది. గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే.. రూ.1000 వరకు దిగివచ్చింది. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేస్తే ఎంతో లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,540 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములకు రూ.1090 తగ్గి రూ.71,510 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,690గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,740గా వద్ద కొనసాగుతుంది. ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కిలో రూ.86,400గా ఉంది. చెన్నైలో వెండి ధర కిలో. రూ.86,400 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్ కొతాలో కిలో వెండి ధర రూ.82,900 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 83,300 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments