మహిళలకు గొప్ప శుభవార్త.. వరుసగా తగ్గుతున్న పసిడి ధర.. నేడు ఎంతంటే?

Gold and Silver Rates: భారత దేశంలో ఇటీవల బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పండుగలు, శుభకార్యాలకు మహిళలకు తమ స్థోమతకు తగ్గట్టు పసిడి కొనుగోలు చేస్తుంటారు. గత కొంత కాలంగా పసిడి ధరలు తరుచూ మారుతూ ఉన్నాయి.

Gold and Silver Rates: భారత దేశంలో ఇటీవల బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పండుగలు, శుభకార్యాలకు మహిళలకు తమ స్థోమతకు తగ్గట్టు పసిడి కొనుగోలు చేస్తుంటారు. గత కొంత కాలంగా పసిడి ధరలు తరుచూ మారుతూ ఉన్నాయి.

ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదీ అంటే వెంటనే చెబుతారు బంగారం. అందుకే పసిడి అంటే ప్రతి ఒక్కరికీ ప్రాణం. ప్రస్తుత కాలంలో బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు.. మంచి పెట్టుబడిగా చూస్తున్నారు. రోజు రోజుకీ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లో ఏ అవసరానికైనా ఇది పనికి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే మేలిమి బంగారం తులం రూ.72 వేలు దాటేసింది. రానున్న రోజుల్లో ఇది లక్షకు చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. తక్కువ ధర ఉన్నపుడు ఎంతో కొంత పసిడి కొని పెట్టుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. నేడు మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

గత కొన్ని సంవత్సరాలుగా పసిడి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. శ్రావణ మాసంలో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలతో సందడి మొదలైంది. దీంతో బంగారం కొనుగోలు శాతం కూడా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి తమ స్థాయికి తగ్గట్లు కొనుగోలు చేస్తుంటారు.ఇక అంతర్జాతయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్దాల ప్రభావం బంగారం, వెండిపై పడుతుంది. గత నెల కేంద్రంలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా విదేశాల నుంచి దిగుమతి సుంకం 6 శాతం తగ్గించడంతో పసిడి ధరలు అమాంతం తగ్గాయి. ఆ మురిపం కొన్నిరోజులకే పరిమితం అయ్యింది. పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,66,590కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, 72,640 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,590 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,640 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,590ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,790 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,590 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,640 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,590 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,640 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.92,100 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.87,100, బెంగుళూరు‌లో రూ.86,100 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.92,100 వద్ద కొనసాగుతుంది.

Show comments