కృష్ణాష్టమి స్పెషల్.. నిన్న ఒక్కరోజే దేశంలో రూ.25,000 కోట్లు బిజినెస్!

Krishna Janmashtami Special: ఆగస్టు 26, సోమవారం దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) నివేదించింది.

Krishna Janmashtami Special: ఆగస్టు 26, సోమవారం దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా దేశంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) నివేదించింది.

దేశ వ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 26) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. జన్మాష్టమి పర్వదినాన తల్లిదండ్రులు తమ పిల్లలను బాల గోపాలుడిగా అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కృష్ణుడు, గోపిక గెటప్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. కరోనా వేవ్ తగ్గిన తర్వాత పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు జోరందుకున్నాయి.ఎన్నడూ లేని విధంగా మార్కెట్ జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) చెబుతుంది. ఈ క్రమంలోనే నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏకంగా రూ.25 వేల కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో శ్రీకృష్ణా జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 26న జరుపుకున్నారు. కృష్ణాష్టమి రోజు భక్తులు ఉపవాసం ఉండి ఇళ్లను పువ్వులు, దీపాలతో అలంకరించారు. స్థానికంగా ఉండే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భజనలు, మతపరమైన నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున బిజినెస్ జరిగిందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. పూలు, పండ్లు, స్వీట్లు, శ్రీకృష్ణుడు, గోపికల కాస్ట్యూమ్స్, అలంకార వస్తువులు, ఉపవాస స్వీట్లు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్‌తో సహా వివిధ రంగాల్లో గణనీయమైన వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.

గతంతో పోల్చితే ఈ ఏడాది పండుగల సందర్భంగా వ్యాపారం గణనీయంగా పెరిగిపోతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వర్గాలు చెబుతున్నాయి. రాఖీ సందర్భంగా పండుగ వ్యాపారం రూ.12,000 కోట్లకు మించి జరిగినట్లు తెలిపారు. గతంలో కన్నా ఈ ఏడాది శ్రీకృష్టాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందని అంటున్నారు. నిన్న స్కూల్స్, ఆలయాలు, ఇండ్లల్లో ఎక్కడ చూసినా చిన్న పిల్లలు కృష్ణుడు, గోపిక గెటప్ లో చూడముచ్చటగా సందడి చేశారు.

Show comments