రెండు రోజుల మురిపమే.. మళ్లీ షాక్ ఇస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Today Gold and Silver Rates August 22nd: ప్రస్తుతం దేశంలో శుభ ముహూర్తాల సీజన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా పెళ్ళి బాజాలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో పసిడి కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు తగ్గిన పుత్తడి మళ్లీ షాక్ ఇచ్చింది.

Today Gold and Silver Rates August 22nd: ప్రస్తుతం దేశంలో శుభ ముహూర్తాల సీజన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా పెళ్ళి బాజాలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో పసిడి కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు తగ్గిన పుత్తడి మళ్లీ షాక్ ఇచ్చింది.

దేశంలో ఇప్పుడు బంగారం కొనుగోలు ఎక్కువైంది. గతంలో మగువలు బంగారం ఆభరణాలుగా మాత్రమే చూసేవారు.. కానీ దీని విలువ రోజు రోజుకీ పెరిగిపోవడంతో ఇన్వెస్ట్ మెంట్ గా మార్చుకుంటున్నారు. భవిష్యత్ లో ఏదైన ఇబ్బందులు వచ్చినా.. ప్రాపర్టీలు కొనుగోలు చేయాలన్నా బంగారం పెట్టుబడిగా పనికి వస్తుంది. అందుకే మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా పసిడి కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, ప్రపంచ దేశాల్లో యుద్దాలు వెరసి పసిడి ధరలపై ప్రభావం చూపుతుంది. ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు వివరాల్లోకి వెళితే..

గోల్డ్ కొనేవారికి భారీ షాక్.. నిన్నటి వరకు వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారే పెరిగిపోయాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. బుధవారంతో పోల్చితే గురువారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కాకపోతే వెండి ధరలు కాస్త తగ్గాయి. కానీ గురువారం (ఆగస్టు 22) పసిడి ధరలు హఠాత్తుగా పెరిగాయి. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,రూ.67,110 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,రూ. 73,210 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,260ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.91,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.86,900, బెంగుళూరు‌లో రూ.84,900 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.91,900 వద్ద కొనసాగుతుంది.

Show comments