ఒక్కగానొక్క కూతురు.. పాపం, ఇలాంటి చావు వస్తుందని ఎవరూ ఊహించలేదు!

ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. ఇక కూతురుని బాగా చదివించి మంచి హోదాలో చూడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ, వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఉన్నట్టుండి కూతురు ఊహించిన రీతిలో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కగానొక్క కూతురు ఇక లేదు, తిరిగి రాదు అని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం మండలం ఆవాలవలస గ్రామం. ఇక్కడే సత్యం-పార్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రావణి (14) అనే ఒక్కగానొక్క కూతురు ఉంది. ఏకైక సంతానం కావడంతో ఈ దంపతులు కూతురుని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. అయితే, ప్రస్తుతం ఈ బాలిక గాదెలవసలో ఉన్న జడ్పీ స్కూల్ లో 9వ తరగతి చదువుతుంది. శ్రావణి స్కూల్ కు రోజూ సైకిల్ మీద వెళ్లేది. ఎప్పటిటాగే శ్రావణి మంగళవారం ఉదయం స్కూల్ కు సైకిల్ మీద బయలు దేరింది.

ఇక మధ్యలోకి వెళ్లగానే ఆ బాలికకు ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చింది. దీంతో శ్రావణి ఆ సమయంలో పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. దీంతో స్థానికులు గమనించి ఆ బాలికను చెరువులోంచి బయటకు తీశారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఉన్న ఒక్క కూతురు కూడా చనిపోవడంతో ఆ దంపతులకు ఏం చేయాలో అర్థం కాక కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇది కూాడా చదవండి: క్రేజీ లవర్‌.. ప్రియుడి కోసం ఊరినే ఇబ్బందుల్లో పడేసింది!

Show comments