iDreamPost

స్కూలు పిల్లలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచి ఒంటిపూట బడులు స్టార్ట్!

  • Published Mar 08, 2024 | 9:57 AMUpdated Mar 08, 2024 | 10:47 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈనెల 15నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఒంటి పూట బడుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈనెల 15నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఒంటి పూట బడుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published Mar 08, 2024 | 9:57 AMUpdated Mar 08, 2024 | 10:47 AM
స్కూలు పిల్లలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచి ఒంటిపూట బడులు స్టార్ట్!

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎండాలు భగభగ మండుతున్నాయి. అసలు వేసవి కాలం అంటేనే విపరీతమైన ఎండలు.. ఉష్ణోగ్రత పెరిగి, ఉక్కపోతతో అల్లాడిస్తుంది. మరి ఇలాంటి  సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితిలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచే తీవ్రమైన ఎండ పెట్టేయడంతో.. అటూ పిల్లలు, వృద్ధులు ఆ సమయంలో బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక మండుతున్న ఈ ఎండల తీవ్రతకు సూళ్లకు వెళ్తున్న పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిఏటా విద్యార్థులకు ఒంటి పూట బడులను నిర్వహిస్తుంటారు. ఇక విద్యార్థులు కూడా వేసవి రాగానే ఒంటి పూట బడులు కోసం తెగ ఎదురు చూస్తుంటారు. కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ  ఒంటి పూట బడుల పై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులను నిర్వహించాలని ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అన్ని ప్రైవేట్ , ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ ఒంటి పూట బడులు అనేవి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వరకు నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులకు ఇళ్లకు పంపించాలని సూచించింది.  అయితే  రాష్ట్రంలో ఈనెల  18 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలు కోసం ప్రభుత్వం  2,700 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఈ పదో తరగతి పరీక్షలు జరిగిన నేపథ్యంలో.. ఆయా స్కూళ్లల కు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక మిగతా అన్ని స్కూళ్లలో మాత్రం యాథవిదిగానే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 30 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, అవి పూర్తయిన వెంటనే పదో తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఆ తర్వాత మిగిలిన క్లాసులకు పాఠశాలలు నిర్వహించి వేసవి సెలువులు ఇవ్వనున్నారు. మరి, తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి