iDreamPost

AP ప్రజలకు శాపంగా మారిన.. తెలంగాణ ఫ్రీ బస్సు పథకం!

  • Published Jan 03, 2024 | 7:46 PMUpdated Jan 03, 2024 | 7:46 PM

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. నడుస్తున్న ఫ్రీ బస్సు పథకంపై ప్రతి రోజు ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్ ఏపీ వాసులపై కూడా పడనుంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. నడుస్తున్న ఫ్రీ బస్సు పథకంపై ప్రతి రోజు ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్ ఏపీ వాసులపై కూడా పడనుంది.

  • Published Jan 03, 2024 | 7:46 PMUpdated Jan 03, 2024 | 7:46 PM
AP ప్రజలకు శాపంగా మారిన.. తెలంగాణ ఫ్రీ బస్సు పథకం!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతా మహిళలకు ఉచితంగానే ప్రయాణించే సదుపాయాన్ని కల్పించారు. దీని కారణంగా నగరంలో బస్సులలో రద్దీ బాగా పెరిగిపోయింది. ఫ్రీ బస్సు వలన ఉపయోగం చెందిన వారికంటే ఇబ్బందులు పడేవారే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అయితే రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింత పెరిగేలా కనిపిస్తోంది. దానికి కారణం వచ్చే కొద్దీ రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండడంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సొంత ఊళ్లకు ప్రయాణం సాగించే దిశగా.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పండగ వచ్చిదంటే ఇటు బస్సులు, ట్రైన్లు అన్నీ కూడా రద్దీగా ఉండడం చూస్తానే ఉంటాం. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుకింగ్స్ కూడా దాదాపుగా అన్ని ఫుల్ అయిపోయాయి. ఇక ప్రస్తుతం ప్రజలకు పండుగకు సొంత ఊళ్లకు వెళ్లడమే సమస్యగా మారింది.

దాదాపు ఒక్క హైదరాబాద్ నుంచే చాలా మంది ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. పండుగకు నెల ముందు నుంచే అటు ట్రైన్ టికెట్స్, ప్రైవేట్ బస్సు టికెట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. దీనితో ఇప్పుడు మిగిలిన వారికీ వారి ఊళ్లకు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సిటీ, ఆర్డినరీ బస్సులు మాత్రమే. అయితే, ఇప్పటికే మహాలక్ష్మి పథకం కారణంగా సిటీలో బస్సులను నడపడం ఇబ్బంది కరంగా మారింది. అటు పల్లెవెలుగు బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోను భారీగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం ఈ బస్సులు 80 నుండి 100 ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ బస్సులను వేరే రూట్లకు వెళ్లేలా సిద్ధం చేయాలి అంటే కాస్త కష్టతరం అవుతోంది. దీనితో ఓ రకంగా తెలంగాణ ఫ్రీ బస్సు పథకం ఏపీ ప్రజలకు శాపంగా మారిందని చెప్పి తీరాలి.

ప్రతి ఏటా 25 లక్షలకు పైగా జనాలు సొంత ఊళ్లకు వెళ్తూ ఉంటారు. ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని అదనంగా దాదాపు 4,500 వరకు అదనపు బస్సులను ప్రజల కోసం కేటాయిస్తుంది. అటు ఏపీఎస్‌ఆర్టీసీ, ఇటు టీఎస్ఆర్టీసీ కూడా అదనపు బస్సులను నడుపుతుంటారు. అయితే, సంక్రాంతి సమయంలో మాత్రం తెలంగాణాలో ఏపీకి చెందిన ప్రజలే ఎక్కువగా సొంత ఊళ్లకు వెళ్తూ ఉంటారు. దీనితో టీఎస్ఆర్టీసీకి ఆదాయం బాగా పెరుగుతుంది. కానీ, ఈసారి ఇలాంటి వాతావరణం ఏమి కనిపించడంలేదు. ఒకవేళ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా బస్సులను ఏపీకి నడిపితే.. అప్పుడు తెలంగాణాలో బస్సుల కొరత ఏర్పడుతుంది. దీనితో టీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోవాల్సి వస్తుంది.

ఇక ఇదే ఛాన్స్ గా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ వారు కూడా అదనపు చార్జీలను వసూళ్లు చేస్తున్నారు. కొంతమంది ప్రజలు కూడా చేసేదేమి లేక.. పండుగకు ఎలాగైనా ఊళ్లకు వెళ్లాలని.. చార్జీలు కాస్త ఎక్కువైనా సరే రాజీ పడడంలేదు. దీనితో ప్రైవేట్ ట్రావెల్స్ కు ఈ నెల భారీగానే ఆదాయం పెరుగుతుంది. కానీ, అంత అమౌంట్ ఛార్జీలకు పెట్టలేని వారు మాత్రం ఆర్టీసీ బస్సుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి, టీఎస్ఆర్టీసీ ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి