iDreamPost

KL Rahul: T20 కెరీర్​పై కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్.. ఆ రీజన్ వల్లే ఆడలేదంటూ..!

  • Published Jan 06, 2024 | 2:46 PMUpdated Jan 06, 2024 | 2:46 PM

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన టీ20 కెరీర్​పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ కారణం వల్లే తాను పొట్టి ఫార్మాట్​లో ఎక్కువ మ్యాచులు ఆడలేదన్నాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన టీ20 కెరీర్​పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ కారణం వల్లే తాను పొట్టి ఫార్మాట్​లో ఎక్కువ మ్యాచులు ఆడలేదన్నాడు.

  • Published Jan 06, 2024 | 2:46 PMUpdated Jan 06, 2024 | 2:46 PM
KL Rahul: T20 కెరీర్​పై కేఎల్ రాహుల్ షాకింగ్ కామెంట్స్.. ఆ రీజన్ వల్లే ఆడలేదంటూ..!

సఫారీ టూర్ పూర్తి చేసుకున్న టీమిండియా తదుపరి జరిగే సిరీస్​ల మీద ఫోకస్ చేస్తోంది. వన్డే వరల్డ్ కప్ ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు ఆ తర్వాత జరిగిన సిరీస్​లు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. మెగాటోర్నీ అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఐదు టీ20ల సిరీస్​ను 4-1తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో తొలుత జరిగిన టీ20 సిరీస్​ను 1-1తో సమం చేసింది. ప్రొటీస్​తో వన్డే సిరీస్​ను 2-1తో గెలుచుకుంది. ఆఖరిగా జరిగిన టెస్ట్ సిరీస్​ను 1-1తో డ్రా చేసింది. మొదటిసారి సఫారీ టూర్​లో సిరీస్​ను కోల్పోకుండా తిరిగొచ్చింది టీమిండియా. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్​తో ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్​తో పాటు ఇంగ్లండ్​తో ఐదు టెస్టుల సిరీస్​పై దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అందుకే ఆఫ్ఘాన్ సిరీస్​లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​ను బరిలోకి దించనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ తన టీ20 కెరీర్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్-2022 తర్వాత నుంచి రాహుల్ పొట్టి ఫార్మాట్​ మ్యాచులకు దూరంగా ఉంటున్నాడు. దీనిపై అతడు తొలిసారి రియాక్ట్ అయ్యాడు. ఇంజ్యురీ కారణంగా టీ20లతో పాటు ఇతర ఫార్మాట్స్​లోనూ చాలా మ్యాచులు మిస్సయ్యానని తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఫలానా పొజిషన్​లోనే ఆడాలనే రూల్స్ తాను పెట్టుకోలేదన్నాడు. ‘టీమ్ మేనేజ్​మెంట్ నాకు ఏదైనా పని అప్పగిస్తే వాళ్లను ఒక్కటే అడుగుతా. నన్ను ప్లేయింగ్ ఎలెవన్​లో ఆడించమని కోరతా. నన్ను ఏ స్థానంలో దించినా సరే నేను ఆడతా. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. దురదృష్టవశాత్తు గాయాల వల్ల నేను చాలా మ్యాచుల్లో ఆడలేకపోయా’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ పొజిషన్ కంటే కూడా టీమ్ తరఫున బరిలోకి దిగడమే తనకు ముఖ్యమని తెలిపాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత అతడు పైకామెంట్స్ చేశాడు.

ప్రొటీస్​తో జరిగిన టెస్ట్ సిరీస్​ను సమం చేయడం మీదా రాహుల్ రియాక్ట్ అయ్యాడు. రెండో టెస్ట్​లో విజయం భారత ప్లేయర్లందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు స్టార్ బ్యాటర్. కేప్​టౌన్​లో తాము ఫస్ట్ టైమ్ గెలిచామన్నాడు. ప్రతిసారి సౌతాఫ్రికా టూర్​కు వచ్చినప్పుడు టెస్టుల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఆఖర్లో ఓటమి పాలవుతూ వచ్చామన్నాడు. అయితే ఈసారి విక్టరీ కొట్టడం చాలా స్పెషల్ అని పేర్కొన్నాడు. గత నాలుగైదేళ్లలో టెస్టుల్లో టీమిండియా ఎంతో ఎదిగిందని, టఫ్ కాంపిటీటర్​గా తయారైందన్నాడు రాహుల్. టెస్ట్ క్రికెట్​ను చాలా ఎంజాయ్ చేస్తున్నామని వివరించాడు. ఇక, గాయం తర్వాత కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్న రాహుల్ వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. టెస్టుల్లో ఆరో పొజిషన్​లో ఆడుతున్నాడు. దీంతో టీ20ల్లో అతడు ఏ స్థానంలో ఆడతాడతనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ.. తనను ఏ పొజిషన్​లో ఆడమన్నా రెడీ అన్నాడు. మరి.. టీ20 కెరీర్, బ్యాటింగ్ ఆర్డర్​పై కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: David Warner: వార్నర్ కోసం గ్రౌండ్​లోకి వేలాది జనం.. మళ్లీ గోల్డెన్ డేస్​ను గుర్తుచేశారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి