iDreamPost

అయ్యప్ప మాల ధరించారని విద్యార్థుల పట్ల.. స్కూల్‌ యాజమాన్యం అరాచకం

సొంత మంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య కుల, మత చిచ్చులు పెడుతూ.. ఆ మంటల్లో చలికాచుకుంటుంటారు. ఇప్పటికే పలు వివాదాలను దేశ రాజకీయాలను కుదిపేశాయి.. చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలాయి.

సొంత మంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య కుల, మత చిచ్చులు పెడుతూ.. ఆ మంటల్లో చలికాచుకుంటుంటారు. ఇప్పటికే పలు వివాదాలను దేశ రాజకీయాలను కుదిపేశాయి.. చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలాయి.

అయ్యప్ప మాల ధరించారని విద్యార్థుల పట్ల.. స్కూల్‌ యాజమాన్యం అరాచకం

దేశంలో రోజు ఏదో ఒక అంశంపై వివాదం నెలకొంటూనే ఉంది. కుల, మతాల పట్ల కుంపట్లు రేపుతున్నారు స్వార్థపరులు. అసలైన సమస్యలను వదిలేసి.. వీటిని రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. గత ఏడాది హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థులు హిజాజ్ ధరించడం రావడంపై కళాశాల యాజమాన్యం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అంశం  దేశం మొత్తంపై తీవ్ర ప్రభావం చూపింది. చివరికీ.. ఈ అంశం సుప్రీంకోర్టు మెట్లెక్కగా.. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇలాంటి మతపరమైన కుంపట్లకు కారణాలుగా మారుతున్నాయి విద్యా సంస్థలు. విద్యాలయాల్లోకి మతపరమైన దుస్తులు ధరించకూడదంటూ ఈ మధ్య కాలంలో సరికొత్త వాదన తెరమీదకు వస్తుంది.

తాజాగా రంగారెడ్డి మొయినాబాద్ హిమాయత్ నగర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఇటువంటి వివాదానికే తెర లేపింది. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారన్న కారణంతో సోనిక, వెంకటేష్ వరుణ్ అనే విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించలేదు. మాల ధారణతో ఉన్న విద్యార్థులను అనుమతినివ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ మేనేజ్ మెంట్ వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు, ఇతర అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు స్కూల్‌కు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నించగా.. అసలు విషయం వెల్లడించారు. పోలీసులు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి