iDreamPost

Asia Cup: చరిత్ర సృష్టించిన శ్రీలంక! ఆసీస్‌ రికార్డు బద్దలుకొట్టి..

  • Published Sep 01, 2023 | 10:48 AMUpdated Sep 01, 2023 | 3:42 PM
  • Published Sep 01, 2023 | 10:48 AMUpdated Sep 01, 2023 | 3:42 PM
Asia Cup: చరిత్ర సృష్టించిన శ్రీలంక! ఆసీస్‌ రికార్డు బద్దలుకొట్టి..

ఆసియా కప్‌ 2023లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంక తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. లంక బౌలర్ల ముందు నిలువలేకపోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒక్కడే 89 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లంతా లంక బౌలింగ్‌ ముందు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్‌ను లంక కేవలం 164 పరుగులకే ఆలౌట్‌ చేసింది. లంక బౌలర్లలో పసర్‌ మతీష పతిరాణ 4 వికెట్లతో రాణించాడు. ఇక 165 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సదీర(54), చరిత అసలంకా(62 నాటౌట్‌) రాణించడంతో లంక చాలా సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

అయితే.. ఈ మ్యాచ్‌లో సాధించిన విజయంతో శ్రీలంక.. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకు సాధ్యంకానీ విధంగా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుని కొత్త చరిత్రను సృష్టించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు బంగ్లా జట్టును ఆలౌట్‌ చేశారు. ఈ మ్యాచ్‌ కంటే ముందు శ్రీలంక ఆడిన 10 వన్డేల్లో కూడా ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసింది. ఇలా వరుసగా 11 వన్డే మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసిన తొలి జట్టుగా లంక నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరుసగా 11 మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేదు.

లంక కంటే ముందు వరుసగా పది వన్డేల్లో ప్రత్యర్థులను ఆలౌట్‌ చేసిన రికార్డు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పేరిట ఉంది. ఇప్పుడా రికార్డులను లంకేయులు బద్దులకొట్టారు. వరుసగా 11 వన్డేల్లో ప్రత్యర్థులను ఆలౌట్‌ చేసిన ఏకైక జట్టుగా కొత్త చరిత్ర లిఖించింది. అయితే.. లంక జట్టు ఈ ఫీట్‌ను చిన్న టీమ్‌ల ఆడి సాధించిందని విమర్శిస్తున్నారు. కాగా, గత ఆసియా కప్‌ సీజన్‌లో కూడా అండర్‌డాగ్స్‌లా బరిలోకి దిగిన లంక.. ఏకంగా కప్పును ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లంక ప్రదర్శన చూస్తే.. ఈ సీజన్‌లో కూడా ఇండియా, పాకిస్థాన్‌ లాంటి టైటిల్‌ ఫేవరేట్స్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మరి లంక సాధించిన అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీలా ఆడే మొనగాడు ఈ ప్రపంచంలోనే మరొకడు లేడు: పాక్‌ స్టార్‌ క్రికెటర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి