iDreamPost

రైల్వే ప్రయాణికులు శుభవార్త.. టికెట్ కొనుగోళ్లపై కీలక నిర్ణయం!

South Central Railway: మన దేశంలోనే అన్ని ప్రధాన వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే ప్రయాణికులక కోసం రైల్వే అధికారులు కొత్త విధానాలు అందుబాటులోకి తీసుకొస్తుంటారు. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

South Central Railway: మన దేశంలోనే అన్ని ప్రధాన వ్యవస్థలో రైల్వే శాఖ ఒకటి. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే ప్రయాణికులక కోసం రైల్వే అధికారులు కొత్త విధానాలు అందుబాటులోకి తీసుకొస్తుంటారు. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే..ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

రైల్వే ప్రయాణికులు శుభవార్త.. టికెట్ కొనుగోళ్లపై కీలక నిర్ణయం!

రైలు.. ఇది సామాన్యులకు ఓ ఎమోషన్. ఎందుకంటే..దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణాలు చేస్తుంటారు. మిగిలిన రవాణా ప్రయాణలతో పోలిస్తే… రైల్వే ధరలు చాలా చౌకగా ఉంటాయి. దీంతో సామాన్యులు రైల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కుటుంబం మొత్తం ప్రయాణం చేయాలని భావించినప్పుడు ముందు వరుసలో ఉండే ఆప్షన్ రైలు. అందుకే రైల్వే శాఖ సైతం అనేక సౌకర్యాలు కల్పిస్తూ..ప్రయాణికులను ఆకర్షిస్తోంది. తరచూ ఏదో ఒక మంచి విషయాన్ని ప్రజలకు అందిస్తుంది. తాజాగా కూడా టికెట్ కొనుగోళ్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులకు ఓ సమస్య తీరినట్లు అవుతోంది. మరి.. ఆ నిర్ణయం ఏమిటి?.  ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

రైలు అనేది మధ్య తరగతి జీవితాలతో పెనవేసుకున్న పరోక్ష అనుబంధం. దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి మదిలో మెదిలే ఆలోచనే రైలు. అందుకే ఓ సినిమాలో  రైలంటే మిడిల్ క్లాస్ వాడి నేల విమానం అని ఓ రచయిత అన్నారు. ఇక పండగల పూట, ఇతర ప్రత్యేక సెలవు దినాల్లో రైళ్ల సీట్లు దొరకాలంటే నెలల ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. అవి కూడా భారీ సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. రిజర్వేషన్లు ఫుల్ కావడంతో కౌంటర్ వద్దకు వెళ్లి జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకోవడం తప్పదు.

good news for railway passengers

ఇలా జనరల్ భోగీలో ప్రయాణించేందుకు టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు  చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిల్లర లేక పోయినప్పుడు, తాము వెళ్లాల్సిన ట్రైన్ బయలుదేరినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు పడే బాధను అర్థం చేసుకున్న రైల్వే శాఖ.. వారి సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేసింది. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలు సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అలానే తాజాగా మరో కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రయాణికుల కష్టాలతో పాటు చిల్లర ఇచ్చే విషయంలో కౌంటర్‌లోని రైల్వే సిబ్బంది బాధలను అర్థం చేసుకుని టికెట్‌ కౌంటర్ల వద్ద చిల్లర విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ పరిష్కారం మార్గాన్ని రూపొందించింది. రైల్వే టికెట్ సెంటర్ లో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కల్పించింది. టికెట్‌కు సరిపడా చిల్లర ప్రయాణికుడి వద్ద లేని సమయంలో డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడా పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ తాజాగా నిర్ణయంతో  చిల్లర కష్టాలు తీరడమే కాకుండా టికెట్ కొనే వారి సంఖ్య కూడా పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైలు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి రైల్వే స్టేషన్ లో టికెట్ విషయంలో చిల్లర కష్టాలు తప్పుతాయని అభిప్రాయపడుతున్నారు. మరి.. సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి