iDreamPost

సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు విశాఖ యువత!

  • Author Soma Sekhar Published - 11:10 AM, Mon - 21 August 23
  • Author Soma Sekhar Published - 11:10 AM, Mon - 21 August 23
సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు విశాఖ యువత!

వీకెండ్ కావడంతో సముద్ర తీరంలో సరదాగా గడుపుదాం అనుకున్నారు ఆ స్నేహితులు. అనుకున్నట్లుగానే సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ ఎంతో సంతోషంగా కొద్ది క్షణాలు గడిపారు. ఆ తర్వాత జరిగిన ఓ ఘటన వారి జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది. జీవితాంతం చేదు గుర్తులను మిగిల్చింది. నవ్వుతూ గడిపిన క్షణాలు కళ్ల ముందే సంద్రంలో కలిసిపోయాయి. దీంతో విహార యత్ర కాస్త విషాద యాత్రగా ముగిసింది. అనూహ్యంగా వచ్చిన రాకాసి కెరాటాలు విశాఖపట్నానికి చెందిన ఆరుగురు యువతను సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ విషాద సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం వన్ టౌన్ కు చెందిన కట్టోజు సాయి(19), కట్టోజు కావ్య(17) సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక(27), గన్నవరపు రవిశంకర్(28) అల్లిపురానికి చెందిన కండిపల్లీ ఫణీంద్ర(25) కండిపల్లి సాయికిరణ్(25) కలిసి వీకెండ్ కావడంతో.. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఆదివారం ఉదయం రాంబిల్లి మండలంలోని సీతపాలెం సముద్ర తీరానికి వచ్చారు. అలా సరదాగా అందరూ కలిసి స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అనంతరం తీరానికి ఆనుకుని ఉన్న బండరాళ్లపై నుంచుని ఫొటో తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద రాకాసి అల వచ్చింది. ఆ అల వారందరికి సముంద్రలోకి లాక్కెళ్లింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో.. పక్కనే ఉన్న మత్స్యకారులు వచ్చి సాయిని మినహా మిగిలిన ఐదుగురిని బయటకు తీసుకొచ్చారు. వీరిలో సాయి ప్రియాంక ఉప్పు నీరు తాగడంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సాయి మాత్రం గల్లంతై మృతి చెందాడు. సాయి మృతదేహం అచ్యుతాపురం మండలం పూడిమడక తీరానికి కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు.. రెండు కిలోమీటర్ల మేర అతడి మృతదేహాన్ని మోసుకొచ్చి, అనకాపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా.. కోమాలోకి వెళ్లిన సాయిప్రియాంకను మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఇదికూడా చదవండి: పాడేరు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి