iDreamPost

Sitagliptin-Diabetes: మూడింట ఒక వంతుకు తగ్గ‌నున్న డ‌యాబెటీస్ టాబ్లెట్స్ రేట్లు

Sitagliptin-Diabetes: మూడింట ఒక వంతుకు తగ్గ‌నున్న డ‌యాబెటీస్ టాబ్లెట్స్ రేట్లు

సిటాగ్లిప్టిన్( Sitagliptin)టాబ్లెట్ ను టైప్ 2 డయాబెటిస్ (Type 2 diabetes ) నియంత్ర‌ణ‌కు వాడ‌తారు.

డయాబెటిక్ నిరోధక ఔషధం సిటాగ్లిప్టిన్ (Sitagliptin) పేటెంట్‌ను రద్దు చేయడంతో, రేట్లు బాగా త‌గ్గ‌నున్నాయి.ఇప్పుడున్న రేటులో మూడింట ఒక వంతుకు రానుంది. అందుకే ఈ అవ‌కాశాన్ని వాడుకోవ‌డానికి భారతీయ ఫార్మాసంస్థ‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి.

సిటాగ్లిప్టిన్ టైప్ 2 డయాబెటిస్(Type 2 diabetes ) చికిత్సకు డాక్ట‌ర్లు సిఫార్స్ చేస్తారు. మ‌ధుమేహ రోగుల్లో శరీరం సాధారణంగా ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా ఉత్పత్తి చేయదు. లేదంటే వాడ‌లేదు. అందుకే రక్తంలో షుగ‌ర్ ఎక్కువగా ఉంటుంది.

మెట్‌ఫార్మిన్ (Metformin )(టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు మరో ఔషధం) వంటి ఇతర మెడిసిన్స్ తో షుగ‌ర్ కంట్రోల్ కాక‌పోయినా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న‌ టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులకు సిటాగ్లిప్టిన్(Sitagliptin) వాడ‌తారు.

US-ఫార్మాస్యూటికల్ మెర్క్ & కో అభివృద్ధి చేసింది, సిటాగ్లిప్టిన్‌ను 2006లో US FDA ఆమోదించింది.

మెర్క్ ఇప్పటివరకు భారతదేశంలో జానుమెట్(Janumet ) బ్రాండ్ పేరుతో సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్‌ల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌ను మార్కెట్ చేస్తోంది. మెర్క్ నుండి లైసెన్స్ ఒప్పందం ప్రకారం, సన్ ఫార్మా సిటాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్-మెట్‌ఫార్మిన్ కాంబినేష‌న్(Sitagliptin-Metformin combination) నుకూడా మార్కెట్ చేస్తుంది. ఇండియాలో రిటైల్ టాబ్లెట్ ధ‌ర‌ టాబ్లెట్‌కు రూ. 38 నుండి 45 వరకు ఉంది.

పేటెంట్ ర‌ద్దు అవ‌డానికి ముందు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) గత నెలలో సిటాగ్లిపిన్(Sitaglipin ) ఫార్ములేషన్ కోసం, రిటైల్ రేటును టాబ్లెట్‌కు రూ. 8 నుండి 21 వ‌ర‌కు నిర్ణ‌యించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి