iDreamPost

DJ Tillu Movie: టిల్లు స్క్వేర్‌ మళ్ళీ వాయిదా? అట్లుంటది టిల్లు గాడి దరిద్రం!

  • Published Jan 05, 2024 | 2:01 PMUpdated Jan 05, 2024 | 2:12 PM

టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని కూడా ప్లాన్ చేశారు. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరిగిదంటే..

టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని కూడా ప్లాన్ చేశారు. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 05, 2024 | 2:01 PMUpdated Jan 05, 2024 | 2:12 PM
DJ Tillu Movie: టిల్లు స్క్వేర్‌ మళ్ళీ వాయిదా? అట్లుంటది టిల్లు గాడి దరిద్రం!

టాలీవుడ్‌లో సంక్రాంతి అంటేనే సినిమాల పండుగే. టాప్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఈ సీజన్‌లో సత్తా చాటాలని కోరుకుంటారు. అందుకే ఈ సారి ఏకంగా ఐదు సినిమాలు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. సంక్రాతికి కొత్త సినిమాలు పోటీ గట్టిగానే ఉంది. వరుసగా స్టార్ హీరోలంతా బరిలో నిలుస్తున్నారు. ఇక ఈ సీజన్ లో ముందుగా సూపర్ స్టార్ మహెశ్ బాబు ‘గుంటూరు కారం’ , అలాగే యంగ్ హీరో తేజ సజ్జ ‘హనుమన్ మూవీ’ జనవరి 12న ప్రేక్షకులను అలరించనున్నారు. మరుసటి రోజు విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’ మూవీతో పలకరించనున్నారు. ఆ తర్వాత ‘నాసామిరంగ’ అంటూ కింగ్ నాగర్జున జనవరి14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వీటితో పాటు రవితేజ ‘ఈగల్’ సినిమా కూడా పోటి పడుతుంది అనుకునే నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సంక్రాతి బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు దీని ప్రభావం సిద్ధూ జొన్నలగడ్డ సినిమా ‘టిల్లు స్క్వేర్‌’ పై గట్టిగానే పడింది. అదే ఎలా అంటే..

సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ పేరుతో చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు. కానీ, డీజే టిల్లు అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. అంతలా డీజే టిల్లు సినిమా సిద్ధూ కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ సినిమాతో సిద్ధూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రేక్షకుల్లో డీజే టిల్లుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక సినిమాలో సిద్ధూ యాక్టింగ్ అయితే మాములుగా లేదు. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ ను ప్లాన్ చేశారు. అదే ‘టిల్లు స్క్వేర్’ మూవీ. కాగా, ఇందులో సిద్ధూ కి జంటగా అనుపమ పరమేశ్వన్ నటిస్తోంది. చాలకాలంగా ఈ సినిమా షూటింగ్ రూపొందించుకొని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

ఈ టిల్లు స్క్వేర్ మూవీ షూటింగ్ ఆగష్టు 2022లో ప్రారంభమైంది. కావున ఈ సినిమాను మొదటగా మార్చి 2023లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఎందుకో మళ్లీ రిలీజ్ డేట్‌ను నవంబర్ 2023కి మార్చారు. ఇక షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండటంతో చివరికి ఈ సినిమా ఫిబ్రవరి 9,2024కి రిలీజ్ చేస్తున్నట్లు డేట్ కన్ఫార్మ్ చేశారు. కాగా, ఇప్పుడు ఈగల్ సినిమా కారణంగా టిల్లు స్క్వేర్ మరోసారి వాయిదా పడక తప్పడం లేదు. ఎందుకంటే సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజ ఫిబ్రవరి 9న ఈగల్‌ను రిలీజ్ చేస్తున్నాడు.

దీంతో.. మళ్లీ టిల్లు స్క్వేర్ మూడోసారి వాయిదా పడబోతుంది. మరోవైపు సినిమా రిలీజ్ డేట్స్ వరుసగా వాయిదా పడటంతో టిల్లు ఫ్యాన్స్ కూడా గట్టిగానే హర్ట్ అవుతున్నారు. మరి ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో అనేదిచూడాలి. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించానున్నారు. అలాగే మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందించాడు. మరి, సిద్ధూ టిల్లు స్క్వేర్ మూవీ మరోసారి వాయిదా పడుతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి