iDreamPost

బడ్డీ కొట్టుకు నెలకు 5 లక్షల అద్దె.. అంత స్పెషలేంటంటే?

Mukesh Ambani: కొందరు గ్రామాల్లో తమ వీధుల్లో బడ్డీ కొట్టు నిర్వహిస్తుంటారు. సొంత స్థలం లేనివారు అద్దెకు తీసుకుని మరీ.. ఈ కొట్టును నిర్వహిస్తుంటారు. ఓ బడ్డీ కొట్టు నెల అద్దె తెలిస్తే షాక్ అవాల్సిందే. ఆ బడ్డీ కొట్టు నెల అద్దె 5 లక్షలు ఉంటుంది.

Mukesh Ambani: కొందరు గ్రామాల్లో తమ వీధుల్లో బడ్డీ కొట్టు నిర్వహిస్తుంటారు. సొంత స్థలం లేనివారు అద్దెకు తీసుకుని మరీ.. ఈ కొట్టును నిర్వహిస్తుంటారు. ఓ బడ్డీ కొట్టు నెల అద్దె తెలిస్తే షాక్ అవాల్సిందే. ఆ బడ్డీ కొట్టు నెల అద్దె 5 లక్షలు ఉంటుంది.

బడ్డీ కొట్టుకు నెలకు 5 లక్షల అద్దె.. అంత స్పెషలేంటంటే?

నేటికాలంలో చాలా మందికి వ్యాపారం చేయాలని ఉంటుంది. అందుకే ఎవరికి ఇష్టం ఉన్నది వారు వ్యాపారంగా కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా కొందరు గ్రామాల్లో తమ వీధుల్లో బడ్డీ కొట్టు నిర్వహిస్తుంటారు. సొంత స్థలం లేనివారు అద్దెకు తీసుకుని మరీ.. ఈ కొట్టును నిర్వహిస్తుంటారు. ఇక వీటికి అద్దె రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది. అలానే సిటీల్లో, నగరాల్లో అయితే ప్రాంతాన్ని బట్టి పదివేల వరకు ఉంటుంది. కానీ ఓ బడ్డీ కొట్టు నెల అద్దె తెలిస్తే షాక అవుతారు. ఆ బడ్డీ కొట్టు నెల అద్దె 5 లక్షలు ఉంటుంది. మరి.. అంత స్పెషలేంటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఓ బడ్డీ కొట్టు అద్దె చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే గరిష్టంగా పదివేల వరకు ఉంటుంది.  కానీ ముంబైనగరంలోని ఓ బడ్డీ కొట్టు నెల అద్దె.. అక్షరాల ఐదు లక్షలు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక అక్కడి బడ్డీ కొట్టుకు అద్దె ఐదు లక్షలు ఉండటానికి బలమైన కారణం ఒకటి ఉంది. అంది ఏమిటంటే.. ఆ కొట్టు అనేది అంబానీ ఇంటి పక్కనే ఉంది. ఈ చిన్న బడ్డీ కొట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి సమీపంలో ఉంది. మరి.. ఏ స్థాయిలో గిరాకీ ఉందే తెలియదు కానీ.. ఆ స్థలం ఓనర్ కి..బడ్డి కొట్టు వ్యక్తి నెలకు ఐదు లక్షలు గడుతున్నారు.

ఈ బడ్డీ కొట్టు అద్దెకు సంబంధించిన  వార్త తెలిసిన చాలా మంది షాక అవుతున్నారు. ఐదు లక్షలు కట్టేంత స్పెషల్ ఏంటంటే.. అంబానీ ఇంటి సమీపంలో ఉండటమే కారణమని పలువురు అభిప్రాయా పడుతున్నారు.ఏది ఏమైనప్పటికి ఆ చిన్న బడ్డీ కొట్టు రెంట్ ఐదు లక్షలు అంటే పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక రిలయన్స్ అధినేత ముఖేస్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వాడే ప్రతి వస్తువు ఖరీదైనదే. ఇటీవలే అంబానీ కుటుంబం తాగే పాలు ఖరీదు గురించి కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసింది.

ఇది ఇలా ఉంటే.. ముకేశ్ అంబాని కుటుంబం ముంబయిలోని అల్టామౌంట్ రోడ్ లో నిర్మించిన ఆంటిలియా అనే భవనంలో నివాసం ఉంటున్నారు. ఈ భవనం 4532 చదరపు మీటర్ల వీస్తీర్ణంలో ఉంటుంది. దీని ధర దాదాపు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా.  లండన్ లో ఉన్న బకింగ్ హామ్ ప్యాలెస్ తరువాత అత్యంత ఖరీదైన భవనంగా ఆంటిలియా ప్రసిద్ది. ఈ  భవనం మొత్తం  27 అంతస్తుల్లో ఉంటుంది. కానీ అసలు ఎత్తు 40 అంతస్తులు మాదిరిగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ గురించి న్యూస్​ వస్తే.. క్షణాల్లోనే వైరల్​ అవుతుంది. అంతేకాక ఆయన పరిసరాల్లో ఏది జరిగిన, ఏది ఉన్న.. అవి కూడా వార్తల్లో నిలుస్తుంటాయి. అలానే తాజాగా ఈ బడ్డీ కొట్టు అంబానీ ఇంటికి సమీపంలో ఉండటంతో వార్తల్లో నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి