iDreamPost

Shahid Afridi: వీడియో: షాహీన్ వేస్ట్.. అందుకు అర్హుడు కాదు! అల్లుడి పరువుతీసిన అఫ్రిదీ

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ.. తన అల్లుడు షాహీన్ అఫ్రిదీ పరువుతీసేలా వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ.. తన అల్లుడు షాహీన్ అఫ్రిదీ పరువుతీసేలా వ్యాఖ్యలు చేశాడు.

Shahid Afridi: వీడియో: షాహీన్ వేస్ట్.. అందుకు అర్హుడు కాదు! అల్లుడి పరువుతీసిన అఫ్రిదీ

పాకిస్తాన్.. 2023 వరల్డ్ కప్ లో ఘోర ఓటమితో ఇంటా, బయట తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో నాకౌట్ చేరకుండానే పాక్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో జట్టులో సమూల మార్పులు చేసింది పాక్ క్రికెట్ బోర్డ్. కానీ ఆటతీరు మార్చుకోకపోవడంతో.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ.. తన అల్లుడు షాహీన్ అఫ్రిదీ పరువుతీసేలా వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్ కప్ 2023లో దారుణ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ జట్టులో కీలకమైన మార్పులు జరిగాయి. సెలెక్టర్లను తీసేయడం, బాబర్ అజంను కెప్టెన్సీ నుంచి తప్పించడం తో పాటుగా కోచింగ్ స్టాఫ్ ను కూడా మార్చింది పాక్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే టెస్టులకు, టీ20లకు కొత్త సారథులను నియమించింది. అందులో భాగంగా షాన్ మసూద్ కు సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు అందించగా.. టీ20 జట్టు కెప్టెన్ గా పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీని నియమించింది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జనవరి 12 నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ మాజీ ఆటగాడు, షాహీన్ అఫ్రిదీ మామ షాహిద్ అఫ్రిదీ అతడికి టీ20 పగ్గాలు అందించడంపై స్పందించాడు. షాహీన్ పరువుతీసేలా మాట్లాడాడు.

షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ..”నా అల్లుడు షాహీన్ అఫ్రిదీ పొరపాటున టీ20 కెప్టెన్ అయ్యాడు. ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అతడు అర్హుడు కాదు. టీ20 కెప్టెన్ గా మహ్మద్ రిజ్వాన్ ను చూడాలి అనుకుంటున్నాను. అతడు గొప్ప ప్లేయర్. పైగా అనుభవం ఎక్కువ. ఆటపట్ల అతడికి ఉన్న నిబద్దత, నైపుణ్యాలను ఎక్కడ ఎలా వాడుకోవాలో రిజ్వాన్ కు బాగా తెలుసు” అంటూ అల్లుడి పరువుతీస్తూ.. మరో ప్లేయర్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇక అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు పక్కనే హారిస్ రవూఫ్, సర్పరాజ్, షాహీన్ అఫ్రిదీ, మహ్మద్ రిజ్వాన్ లు పక్కనే ఉన్నారు. అతడు ఈ మాటలు అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి అనుకోకుండా తన అల్లుడు కెప్టెన్ అయ్యాడన్న అఫ్రిదీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి