iDreamPost

గుడ్ న్యూస్ చెప్పిన SBI.. కేవలం 45 నిమిషాల్లోపే బిజినెస్ లోన్..

Business Loan Within 45 Mins: బిజినెస్ లోన్స్ కోసం ఎదురుచూసేవారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రోజుల తరబడి లోన్స్ కోసం తిరిగే పని లేకుండా కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేసేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అది కూడా సులువుగా లోన్ వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

Business Loan Within 45 Mins: బిజినెస్ లోన్స్ కోసం ఎదురుచూసేవారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రోజుల తరబడి లోన్స్ కోసం తిరిగే పని లేకుండా కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేసేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అది కూడా సులువుగా లోన్ వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

గుడ్ న్యూస్ చెప్పిన SBI.. కేవలం 45 నిమిషాల్లోపే బిజినెస్ లోన్..

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ బిజినెస్ లోన్స్ కోసం ఎదురుచూసేవారికి శుభవార్త చెప్పింది. సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేసేలా ఎంఎస్ఎంఈ డిజిటల్ లోన్స్ ని ప్రారంభించింది ఎస్బీఐ బ్యాంక్. రాబోయే ఐదేళ్ళలో ‘తక్కువ మొత్తం బిజినెస్ లోన్స్’ విభాగం నుంచే అధికంగా వృద్ధి, లాభాలు వంటివి వస్తాయని ఎస్బీఐ బ్యాంకు భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈలకు త్వరగా లోన్స్ మంజూరు చేసే కొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 4.33 లక్షల కోట్ల మేరకు లోన్స్ ని మంజూరు చేసింది. 2022-23వ ఆర్థిక ఏడాదిలో ఇచ్చిన రుణాలతో పోలిస్తే ఇది 20 శాతం అధికం.

ఈ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2019-20వ ఆర్థిక సంవత్సరంలో 9.43 శాతం కాగా, 2023-24 నాటికి 3.75 శాతానికి తగ్గాయి. దీంతో ఈ విభాగంలో ఎస్బీఐ తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటామని తెలిపింది. ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించి తమ వద్ద చాలా సమాచారం ఉందని.. దాన్ని విశ్లేషించడం ద్వారా రుణ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. కొత్తగా స్టార్ట్ చేసిన ఈ విధానంతో  సంప్రదాయంగా ఉన్న క్రెడిట్ అండర్ రైటింగ్, సుదీర్ఘమైన పరిశీలనలు వంటివి తొలగిపోతాయని అన్నారు. చిన్న పరిశ్రమలకు రుణ మంజూరులో వేగం పెరుగుతుందని.. అలానే సరళంగా కూడా ఉంటుందని అన్నారు.

ఐటీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్మెంట్లు సహా అవసరమైన వివరాలను సమర్పించిన అనంతరం 10 సెకన్లలోపే లోన్ మంజూరు నిర్ణయాన్ని తెలియజేసేలా డేటా ఆధారిత లోన్ మంజూరు టెక్నాలజీని ఈ కొత్త విధానంలో డెవలప్ చేశామని ఎస్బీఐ ఛైర్మన్ పేర్కొన్నారు. అలానే ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు అవసరం లేకుండా కేవలం జీఎస్టీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే 50 లక్షల లోపు రుణాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. బ్యాంకుతో అనుబంధం ఉన్న సంస్థలతో పాటు కొత్త వ్యాపార సంస్థలకు కూడా 45 నిమిషాల్లోపే రుణ అనుమతి పొందేలా డిజిటల్ బిజినెస్ లోన్స్ విభాగం సహకరిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 25 వేల కోట్లను సమీకరించాలని ఎస్బీఐ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు నుంచి కూడా అనుమతి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. ఆల్రెడీ బ్యాంకుతో అనుబంధం ఉన్నవారికే కాకుండా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసిన వారికి కూడా ఎస్బీఐ బ్యాంకు రుణాలను మంజూరు చేయనుంది. లెదర్ ఉత్పత్తులు, గొడుగుల ఫ్రేములు, దువ్వెనలు, ప్లాస్టిక్ దువ్వెనలు నమూనాలు చేసేవారు, బ్యూటీ పార్లర్, ఎక్స్ రే క్లినిక్స్, ఆటో రిపేర్ సర్వీసెస్, గ్యారేజ్ వంటి వ్యాపారాలు చేసుకునేవారు ఈ ఎస్బీఐ లోన్స్ పొందవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి