iDreamPost

ఈ యువతి కోట్ల మందికి ఆదర్శం.. 8 ఏళ్లకే వివాహం చేసినా..

ఆడుతూ పాడుతూ తిరిగి వయస్సులో పాపకు పెళ్లి చేశారు. అయితే చిన్నారి పెళ్లి కూతుర్ని అత్తారింటికి పంపలేదు ఆమె నాన్న. మెచ్యూర్ అయ్యాక పంపిస్తానని తన వద్దే ఉంచుకుని చదివించాడు. కానీ పది పూర్తయ్యాక ఆమె అత్తారింటికి వెళ్లక తప్పలేదు.

ఆడుతూ పాడుతూ తిరిగి వయస్సులో పాపకు పెళ్లి చేశారు. అయితే చిన్నారి పెళ్లి కూతుర్ని అత్తారింటికి పంపలేదు ఆమె నాన్న. మెచ్యూర్ అయ్యాక పంపిస్తానని తన వద్దే ఉంచుకుని చదివించాడు. కానీ పది పూర్తయ్యాక ఆమె అత్తారింటికి వెళ్లక తప్పలేదు.

ఈ యువతి కోట్ల మందికి ఆదర్శం.. 8 ఏళ్లకే వివాహం చేసినా..

అవనిలో సగం, ఆకాశంలో సగం.. అన్నింటా సగం అనే మాటలు వినడానికి వీనుల విందుగా ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం ఆడ పిల్లల విషయంలో ఇంకా వివక్ష కొనసాగుతుంది. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళుతున్న కూడా ఆడ పిల్లలు పుడితే భారంగా చూస్తున్న కుటుంబాలు ఉన్నాయి. అందుకే పాప పుట్టిందని తెలియగానే.. ఖర్చు అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమెను చదివిస్తే.. ఆ కుటుంబానికే ఆసరాగా నిలుస్తుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే చిన్న వయస్సులోనే బాల్య వివాహాలు చేసి.. అత్తారింటికి పంపి.. చేతులు దులుపుకుంటున్నారు. ఇదిగో ఆ బాధితురాల్లో రూపా యాదవ్ కూడా ఒకరు. ఆమె 8 ఏళ్లకే ఊహించని విధంగా చిన్నారి పెళ్లి కూతురు అయ్యింది.

పెళ్లి చేసినా.. తండ్రి కూతుర్ని చదివించాలన్న ఉద్దేశంతో అత్తారింటికి పంపకుండా..పుట్టింట్లోనే ఉంచేశాడు. కాపురానికి పంపకుండా కూతుర్ని నీ దగ్గరే పెట్టుకుంటావా అంటూ సూటి పోటీ మాటలు పడ్డా.. వినిపించుకోకుండా చదివించాడు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయలేదు రూపా.. చదువుకుని డాక్టర్ అవ్వడంతో పాటు ఆ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చింది. నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఈ స్పూర్తి వంతమైన స్టోరీ కథానాయకీది రాజస్తాన్. కరిరి అనే చిన్న గ్రామంలో పుట్టింది రూపా యాదవ్. అయితే రూపా పెద్దనాన్న ఇచ్చి వాగ్దానంతో.. 8 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశాడు ఆమె తండ్రి. అయితే రూపను చదివించాలన్న ఉద్దేశంతో మెచ్యూర్ అయ్యేంత వరకు తన వద్ద ఉంచుతానని అత్తారింటికి చెప్పాడు. అలా పుట్టింట్లోనే ఉంటూ పదో తరగతి పూర్తి చేసింది.

This young lady is a role model for crores of people 02

86 శాతం మార్కులతో పాసై.. ఊరికి మంచి పేరు తెచ్చింది. ఊరు కూడా ఆమె పట్ల గౌరవంగా చూడసాగింది. కూతుర్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలని తండ్రిని గ్రామస్థులు ప్రోత్సహించారు. అయితే ఆమె మెచ్యూర్ కావడంతో అత్తింటి వారు కాపురానికి పంపాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రూపా బావగారు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వనని మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఆమె కుటుంబం ఉన్నత చదువులు చదివించింది. భర్త కూడా అందుకు సపోర్టుగా నిలిచాడు. అలా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో చేరి చదువుకుంటూ.. నీట్ పరీక్షకు ప్రిపేరయ్యింది. ఇరుగు, పొరుగు హేళనలు చేసినా ఆమె ఫ్యామిలీ పట్టించుకోలేదు సరికదా.. రూపా లక్ష్యం కోసం మరింత కష్ట పడింది.

వీరి ప్రతి ఫలానికి తగ్గట్లు రూపా నీట్‌లో పాసై బికినీర్‌లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజీలో చేరింది. అలా అత్తారింటి సపోర్టుతో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. లాక్ డౌన్ సమయంలో ఇటికి వచ్చాక.. ప్రెగ్నెంట్ అయ్యింది. మూడో ఏడాది ఫైనల్ పరీక్షలు ఇంకొన్ని రోజులు ఉన్నాయనగా.. కూతురు పుట్టింది. బాలింతగా వచ్చి పరీక్షలు రాసింది. అలా 2022లో వైద్య విద్యను పూర్తి చేసింది. డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూనే.. పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం సిద్ధమవుతుంది. పెళ్లైతే వంటింటికే పరిమితం చేయాలని భావిస్తున్న ఎంతో మంది అత్తవారిళ్లకు ఈ స్టోరీ ఓ మేలు కొలుపుగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే చదువు విషయంలో ఎన్నో వంకలు పెట్టే వారికి ఆమె నిదర్శనం, చాలా మంది స్పూర్తిదాయకం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి