iDreamPost

బ్రేకింగ్: ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన RTC బస్సు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

  • Published Nov 06, 2023 | 10:51 AMUpdated Nov 06, 2023 | 11:01 AM

దేశంలో ప్రతిరోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల చేస్తున్న తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

దేశంలో ప్రతిరోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల చేస్తున్న తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

  • Published Nov 06, 2023 | 10:51 AMUpdated Nov 06, 2023 | 11:01 AM
బ్రేకింగ్: ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన RTC బస్సు.. స్పాట్‌లో ముగ్గురు మృతి

ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా పాటిస్తున్నా.. ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. కేవలం డ్రైవర్లు చేసే తప్పిదాల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, నిర్లక్ష్యం, అనుభవం లేకుండా డ్రైవింగ్ చేయడం ఇలాంటి ఎన్నో తప్పిదాల వల్ల ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫ్లాట్ ఫాం పైకి దూసుకురావడంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లాట్ ఫామ్ పై వేచి ఉన్న ప్రయాణికులనపైకి ఆర్టీసీ బస్సు హఠాత్తుగా దూసుకు రావడంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో కండెక్టర్, ఏడాదిన్నర చిన్నారి, మహిళ ఉన్నారు. ఈ ప్రమాదంలో అక్కడ నిల్చున్న మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. నెహ్రూ బస్టాండ్ 12వ నంబర్ ఫ్లాట్ ఫాం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పక్క ఫ్లాట్ ఫాంలపై ఉన్న ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది.. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారీ బస్సు మీదకు దూసుకు రావడంతో అక్కడ నిల్చున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయపడిపోయారు.. పరుగులు తీశారు.

మృతి చెందిన కండక్టర్ గుంటూరు – 2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. బస్టాండ్ ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా బీభత్సంగా కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా ఫ్లాట్ ఫామ్ వద్ద బస్సులు చాలా నెమ్మదిగా వెళ్తుంటాయి.. డ్రైవర్ ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో తెలియని పరిస్థితి అంటున్నారు బాధితులు. అయితే డ్రైవర్ పొరపాటున రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయండతోనే ఈ ప్రమాదం జరిగిందని డిపో ఆర్ ఎం తెలిపారు. ఈ ప్రమాదంలో బస్టాండ్ లో చాలా వరకు ఆస్తి నష్టం కూడా జరిగిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి