iDreamPost

ఓటిటిలో RRR – కండీషన్స్ ఉన్నాయి

ఓటిటిలో RRR – కండీషన్స్ ఉన్నాయి

దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ అఫీషియల్ ఓటిటి డేట్ వచ్చేసింది. ఈ నెల 20 అంటే వచ్చే శుక్రవారమే జీ5లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికిది రెండు మూడు రోజుల క్రితమే లీక్ అయ్యింది. కాకపోతే పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులోకి తెస్తున్నారు. అంటే డబ్బులిచ్చి ఈ ఒక్క సినిమా చూడటమన్న మాట. అకౌంట్ ఉన్నా సరే అదనంగా సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. ఎంతనేది చెప్పలేదు. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తెలుగు హిందీ తమిళం మలయాళం జీ5లో రానుండగా హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో ఉంటుంది

వరల్డ్ వైడ్ 1100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ విజువల్ గ్రాండియర్ ఇప్పటికే నెమ్మదించింది. ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. సెంటర్లు బాగానే నమోదయ్యాయి కానీ నిన్న సర్కారు వారి పాట రావడంతో కొన్ని తగ్గాయి. ఫైనల్ కౌంట్ ఎంతనేది యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఇవాళ సాయంత్రం నుంచి వేడుకలు చేయబోతున్నారు. ఇంకా కన్నా లాంగ్ రన్ ఆర్ఆర్ఆర్ కు ఆశించలేం. వంద రోజుల గురించి ఆలోచించడం అత్యాశ అవుతుంది కానీ ఎక్కడైనా షిఫ్టింగ్ మీద హండ్రెడ్ డేస్ ఆడుతుందేమో చూడాలి. డిజిటల్ లోకి వచ్చాక హాలు వెళ్లే అతికొద్ది ప్రేక్షకులు తగ్గిపోతారు.

వ్యూస్ పరంగా సబ్స్క్రైబర్స్ పెరిగే విషయంలో జీ5 ఆర్ఆర్ఆర్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. రికార్డులు ఖాయమని నమ్ముతోంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తో పోలిస్తే ఈ ప్లాట్ ఫార్మ్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. కంటెంట్ ఉన్నప్పటికీ 4కె, డాల్బీ సౌండ్ లాంటి ఫీచర్స్ ని ఇవ్వడంలో ఇది వెనుకబడి ఉంది. ఆర్ఆర్ఆర్ నుంచి ఇది మారుతుందనే నమ్మకంతో ఉన్నారు మూవీ లవర్స్. ఇప్పుడైనా జరగకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ రోజు కాశ్మీర్ ఫైల్స్ ని మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేసిన జీ5 కేవలం వారం రోజుల గ్యాప్ లో మరో బ్లాక్ బస్టర్ అందించడం విశేషం. కాకపోతే ఆల్రెడీ చూసేసిన సినిమాని మళ్ళీ డబ్బులు కట్టి చూస్తారా అనేదే ప్రశ్నార్థకం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి