iDreamPost

వారికి కోర్ట్ వేసిన మొట్టికాయలు మరిచారా రాధాకృష్ణ గారు ??

వారికి  కోర్ట్ వేసిన మొట్టికాయలు మరిచారా  రాధాకృష్ణ గారు ??

ఆదివారం వస్తే చాలు కొత్త పలుకుల పేరుతో ఏదో ఒక అంశాన్ని,సంఘటన ఆధారంగా జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రాధా కృష్ణ ఈరోజు మరొకసారి బట్టకాల్చి ముఖ్యమంత్రి జగన్ మీద వేశాడు.నేదురుమల్లి జనార్ధన రెడ్డి తన హయాంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయటానికి పర్మిషన్ ఇచ్చిన ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజిల వ్యవహారంలో కోర్టు తప్పుపట్టటంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారని, కాని ముఖ్యమంత్రి జగన్ కు కోర్టుల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్న రాజీనామ చేయడంలేదని అసత్యాలు ప్రచురించారు. ప్రైవేట్ ఇంజినీరింగ్,మెడికల్ కాలేజీలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు ప్రచరానికి వ్యతిరేకంగా నేదురుమల్లి జనార్ధన రెడ్డి పేరు ఆర్.కే ముందుకు తీసుకుని రావడం సంతోషించే వార్తే అయినా, ఆ కాలేజీలను కుట్రతో అడ్డుకున్నది చంద్రబాబే అని చెప్పడానికి ఎందుకో ఆయన కలం కదల్లేదు.

ఇక రాజీనామాల విషయానికి వస్తే ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ పై విశాఖకు చెందిన రాజు వేసిన కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని కోర్టు చెప్పినప్పుడు, అలాగే ఓటుకు నోటు కేసులో ఆ గొంతు చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనమా చేయలేదో రాధాకృష్ణా అడగకపోవడం ఆయనకి చంద్రబాబుకి మధ్య ఉన్న స్నేహ బంధానికి ప్రతీకగా చూడొచ్చు. ఇక ఆర్ కే చెప్పే నేదురుమల్లి జనార్ధన రెడ్డి హయాంలో జరిగిన మెడికల్ కాలేజీల వ్యవహారం మాట్లాడుకోవల్సి వచ్చినప్పుడు ఆయన హయాంలో జరిగిన మరికొన్ని విషయాలు కూడా ప్రస్థావనకి రావల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీలను స్థాపించి విద్యారంగం, హైటెక్ సిటి స్థాపించి సాఫ్ట్ వేర్ రంగాన్ని నేనే అభివృద్ది చేశా అని చెప్పుకునే చంద్రబాబు నిజానికి ఈ రాష్ట్రానికి తన స్వార్ధ రాజకీయాలకోసం ప్రైవేట్ఇంజినీరింగ్ మరియు మెడికల్ కాలేజీలు రాకుండా అడ్డుకున్న వ్యక్తి అని 90వ దశకంలో రాజకీయాలను క్షుణంగా పరిశీలించిన వారి మాట. 1989 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం , 1991లో ప్రధానిగా పి.వి నరసింహారావు అధికారం చేపట్టడంతో సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి పి.వి నేతృత్వంలో ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలకు బీజం వేసారు.

రాజీవ్ గాంధి మొదటి వర్ధంతి రోజు రాజీవ్ స్మారకంగా 21-May-1992నాడు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి సైబర్ టవర్స్ భవననిర్మాణంకి శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యప్తంగా ఉన్న దాదాపు 200 ప్రముఖ కంపెనీలకు లేఖలు రాసి, రాష్ట్రం కల్పించే ఐటి సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. భవిష్యత్తులో హైదరాబాద్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ కు, చిప్ డిజైనింగ్ కు కేంద్రం అవుతుందని అప్పుడే జోస్యం చెప్పారు. కాని హైటెక్ సిటి చరిత్రలో అప్పటి ప్రధాని పి.వి నరసింహారావు గారి మార్గదర్శనం కాని అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారి కార్యాచరణ తాలూక ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి శంకుస్థాపన జరిగిన హైటెక్ సిటి బిల్డింగ్ ఘనతను చంద్రబాబు సులువుగా తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక కాలేజీల విషయానికి వస్తే ,రాష్ట్రంలో విద్యారంగాన్ని పెంపొందిచాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ , మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రణాళికలు రచించిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి నిర్ణయం మీద కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకున్న ఘనత చంద్రబాబుది. రాష్ట్రానికి రాబొయే ఇంజినీరింగ్ కాలేజీలు అలాగే 12 మెడికల్ కాలేజీలు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తున్నారని, అందులో ఒక మెడికల్ కాలేజీ నెదురుమల్లి జనార్ధన రెడ్డి తన బంధువుకి కేటాయించారనే నెపంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాలేజీలను రద్దు చేయించాలని ఉద్యమం చేశారు. హైదరాబాద్ లో తెలుగు యువత విద్యార్ధి విభాగం చేత విద్యార్ధుల ముసుగులో ధర్నాలు రాస్తారొకోలు చేయించారు.ఈనాడు పేపర్ పెద్ద పెద్ద శీర్షికలు రాసి ఉద్యమం అని పేరు పెట్టి ముందు ఉండి నడిపింది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను సైతం అడ్డుకున్నారు. చివరికి కోర్టుకు వెళ్ళి కుట్ర పన్నివాటిని రద్దు చేయించారు. దీంతో రాష్ట్రంలో ఏర్పాటు అవ్వాల్సిన ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఈ పరిణామాలు చివరికి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రి పదవి రాజీనామాకు దారి తీసాయి. ఆ కాలేజీలే ఆనాడు ఏర్పడి ఉంటే నేడు మన రాష్ట్రం వైద్య రంగంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎంతో ముందు ఉండేదని,తెలుగు విద్యార్థులు చెన్నై,బెంగుళూరు వెళ్లి చదువుకోవలసిన పరిస్థితి ఉండేది కాదు,ఆ రాష్ట్ర విద్యార్థులే మన రాష్ట్రానికొచ్చి చదువుకునేవారని
విశ్లేషకుల మాట.

నిజానికి ఆనాడు ఒక కాలేజీ జనార్ధన రెడ్డి తన బందువులకు కేటాయించారని మొత్తం 12 మెడికల్ కాలేజిలను కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకున్న చంద్రబాబు ఆ తరువాత తన హయాంలో విద్యను వ్యాపారంగా మార్చి మొదట కాలేజీల పర్మిషన్ ఇచ్చి ,తదుపరి వారిలో ఎందరికో ఎమ్మెల్యే,ఎంపీ టిక్కెట్లు ఇచ్చి చట్టసభలకు పంపించారు. సాక్షాత్తు విద్యను వ్యాపారం చేసి ఫీజులు పేరుతో విద్యార్ధులను వేధించే ప్రముఖ సంస్థ అధినేతకు ఏకంగా మంత్రి పదవి ఇచ్చి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు.

ఇక నేడు కోత్తపలుకులు పేరుతో ఆర్.కే నేదురుమల్లి జనార్ధన రెడ్డి రాజీనామా వివరాలను తొక్కిపెట్టి కోర్టు నిర్ణయాల పేరుతొ జగన్ రాజీనామా చేయాలని పరోక్షంగా డిమాండ్ చేస్తూ రాసిన కొత్తపలుకుల్లో కోర్టుతో అనేకసార్లు మొట్టికాయలు వేయించుకున్న ఎన్టీఆర్ , చంద్రబాబు పేరులు ప్రస్తావించకపోవటం ఆయనకు టీడీపీ మీద ప్రేమే కారణమా?ద్రోణం రాజు సత్యనారాయణ వేసిన కేసులో ఎన్టీఆర్ కు కోర్టు తో ఎంత బొప్పి కట్టిందో రాధాకృష్ణకు తెలియదా? అయినా ఆ విషయాలు ప్రస్తావించరు .. ఎందుకంటే వారి చంద్రబాబు ,RKల మధ్య ఉన్న బంధం తెలియనిది ఎవరికి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి