iDreamPost

APలోని ఆ శాఖలో ఉద్యోగాలు!.. నెలకు రూ. 54 వేల వరకు జీతం!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఏపీలోని ఆ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు మీకోసం..

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఏపీలోని ఆ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు మీకోసం..

APలోని ఆ శాఖలో ఉద్యోగాలు!.. నెలకు రూ. 54 వేల వరకు జీతం!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రభుత్వ వైద్య కాలేజీలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 256 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన డిసెంబర్ 11 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://allurisitharamaraju.ap.gov.in/ ను పరిశీలించాలని అధికారులు కోరారు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పారామెడికల్‌ పోస్టులు:

256

పోస్టుల వివరాలు:

  • రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, అనస్థీషియా టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, డెంటల్‌ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్స్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మార్చురీ అటెండెంట్స్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబార్డినేట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఫార్మసిస్టు, ఫిజియోథెరపిస్టు, ప్లంబర్స్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, రిఫ్రాక్షనిస్టు, స్పీచ్ థెరపిస్టు, స్టోర్ అటెండర్, సిస్టమ్ అడ్మినిస్టేటర్ పోస్టులు ఉన్నాయి.

అర్హత:

  • పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్‌, పీహెచ్‌డీఎంహెచ్‌వో తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 42 సంవత్సరాల వయసు మించకూడదు.

ఎంపిక విధానం:

  • విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం:

  • ఎంపికైన వారికి 35 వేల నుంచి 54 వేల వరకు జీతాన్ని అందిస్తారు.

అప్లికేషన్ విధానం:

  • అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపించాలి.

అప్లికేషన్ కు చివరి తేదీ:

  • 11-12-2023

అధికారిక వెబ్‌సైట్‌ :

https://allurisitharamaraju.ap.gov.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి