iDreamPost

సందీప్ ఎలిమినేషన్.. ఫెయిరా? అన్ ఫెయిరా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వారాలు గడుస్తున్న కొద్దీ ఆట మరింత ఆసక్తిగా మారుతోంది. తాజగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అయితే సందీప్ ఎలిమినేషన్ ఫెయిరా.. అన్ ఫెయిరా అనే ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వారాలు గడుస్తున్న కొద్దీ ఆట మరింత ఆసక్తిగా మారుతోంది. తాజగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అయితే సందీప్ ఎలిమినేషన్ ఫెయిరా.. అన్ ఫెయిరా అనే ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సందీప్ ఎలిమినేషన్.. ఫెయిరా? అన్ ఫెయిరా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట మరింత ఆసక్తిగా మారుతోంది. మొత్తం ఎనిమిది వారాలు పూర్తయ్యయి. ఎనిమిది మంది కంటెస్టెంస్ట్స్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఎనిమిదో వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు సందీప్ మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి. నిజానికి బయట సందీప్ అంటే కోపిస్టి అనే పుకార్లు ఉండేవి. కానీ, ఈ సీజన్ ద్వారా అది తప్పని తెలుగు ప్రేక్షకులకు తెలిసినట్లు అయ్యింది. అయితే సోషల్ మీడియాలో సందీప్ ఎలిమినేషన్ ఫెయిరా? అన్ ఫెయిరా? అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఈ ఉల్టా పుల్టా సీజన్ లో అయితే మరింత ఉల్టాగా గేమ్ జరుగుతోంది. బిగ్ బాస్ ఎప్పుడు ఏ నిర్ణయం అయినా తీసుకుని హౌస్ మేట్స్ ని షాక్ కి గురి చేస్తూనే ఉన్నాడు. ఇంక సందీప్ ఆట విషయానికి వస్తే.. హౌస్ లో చాలా బ్యాలెన్స్డ్ గా సందీప్ ఆడాడు అనే చెప్పాలి. దాదాపుగా హౌస్ నుంచి ఎలాంటి నెగిటివిటీ లేకుండా బయటకు వచ్చాడు. ఉన్నన్ని రోజులు హౌస్ లో అందరితో మంచిగా ఉన్నాడు. కొందరితో కలిసి గేమ్ ఆడాడు. అదే సందీప్ కు కాస్త నెగిటివిటీని కూడా తెచ్చిపెట్టింది. నిజానికి టాస్కులు అనగానే సందీప్ ప్రాణం పెట్టి ఆడతాడు. కానీ, ఈ సీజన్ లో బిగ్ బాస్ తీసుకొచ్చిన పవరాస్త్రం పుణ్యమా అని సందీప్ కు ఆడే అవకాశం లేకుండా పోయింది.

మొగటి వారమే హౌస్ మేట్ అయిపోయి సందీప్ 5 వారాలు ఇమ్యునిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇంక టాస్కులు ఆడే అవసరం లేకుండా పోయింది. ప్రతి టాస్కులో సందీప్ ని సంచాలక్ గా పెట్టేశారు. అప్పటి నుంచే సందీప్ గ్రాఫ్ చిన్నగా పడిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే సంచాలక్ గా సందీప్ తీసుకున్న నిర్ణయాలు అతనికే బ్యాక్ ఫైర్ అయ్యాయి. స్టేజ్ మీద హోస్ట్ నాగార్జున వరస్ట్ సంచాలక్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హౌస్ మేట్ కావడమే తనకి మైనస్ అయ్యింది అనే విషయాన్ని స్వయంగా సందీప్ ఒప్పుకోవడం చూశాం. మొదటి వారాల్లో అమర్ దీప్ తో కలిసి సందీప్ కూడా కొన్ని గేమ్స్ ఫౌల్ ఆడాడు అది సందీప్ గేమ్ పై చాలా ప్రభావం చూపింది. సందీప్ అసలు అంత ఫౌల్ గేమ్ ఎలా ఆడతాడు అంటూ ప్రేక్షకులు కూడా ఫుల్ ఫైర్ అయ్యారు.

అక్కడక్కడ మాటలు జారడం, కొందరి కోసం స్టాండ్ తీసుకుని సందీప్ కూడా బ్యాడ్ అయ్యాడు. అలాగే లెటర్ టాస్కులో సందీప్ త్యాగం చేసుంటే కొన్ని మంచి మార్కులు వచ్చేవి అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే మొత్తానికి 7 వారాలు నామినేషన్స్ లోకి రాకుండా సందీప్ రికార్డులు క్రియేట్ చేశాడు. కానీ, వచ్చిన తొలి వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఆట సందీప్ చెరగని ముద్రవేశాడు అనే చెప్పచ్చు. ఇంక.. సందీప్ ఎలిమినేషన్ ఫెయిరా? అన్ ఫెయిరా? అంటే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఇన్ని వారాలు నామినేషన్స్ లో లేకపోవడమే సందీప్ కి పెద్ద మైనస్. మళ్లీ తిరిగి హౌస్ లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను అని సందీప్ చెప్పాడు. అయితే ఆ ఛాన్స్ వచ్చింది అని చెప్పడానికి లేదు. తిరిగి ఆట సందీప్ హౌస్ లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు లేవు. మరి.. సందీప్ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి