iDreamPost

రైలు వెనుక ‘X’ అని ఎందుకు రాస్తారో తెలుసా?

రైలు వెనుక ‘X’ అని ఎందుకు రాస్తారో తెలుసా?

మనలో ప్రతి ఒక్కరం రైలు ప్రయాణం చేసే ఉంటాం. కిటికీ పక్కన కూర్చొని వచ్చే పోయే రైళ్ళను చూస్తూ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రయాణంలో ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అయితే ప్రతి రైలు వెనుక “X” అని రాసి ఉండటాన్ని కచ్చితంగా మీరు గమనించే ఉంటారు. మరి అలా ఎందుకు రాసి ఉంటుందో? దాని అర్థం ఏంటో? తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రండి తెలుసుకుందాం.

ప్రతి రైలు బండి వెనుక చివరి కంపార్ట్ మెంట్ పై ఈ ‘X’ గుర్తు ఉంటుంది. ఇది సాధారణంగా పుసుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తుంది. కదులుతున్న రైలుకు అదే చివరి కోచ్ అని తెలిసేందుకు ఇలా X గుర్తును వేస్తారు. ఒక రైలు మధ్యలో ఏ బోగీని వదలకుండా పూర్తిగా ముందుకు కదిలిందని తెలిపేందుకే ఈ సూచికను వేస్తారు.

X గుర్తుతో ఉన్న బోగీ రైలు చివర లేనట్లయితే, ఆ రైలు ప్రమాదంలో ఉందని సిబ్బందికి సూచిస్తుంది. రైల్ క్రాసింగ్ అయ్యే సందర్భంలో డ్యూటీలో ఉన్న గార్డు ‘X’ మార్కును గుర్తించిన తరువాతనే రైలు బోగీలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్థారిస్తూ ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.

X గుర్తు లేని సమయంలో స్టేషన్ మాస్టర్ అప్రమత్తం అవుతారు. సదరు రైలు ప్రమాదంలో ఉందని గుర్తించి హెచ్చరికను జారీ చేస్తారు. సాధరణ పౌరులు సైతం ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్న రైలు బోగీ చివర X గుర్తు లేనట్లయితే సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కు వెంటనే ఫిర్యాదు చేయచ్చు.

అయితే X గుర్తుతో పాటు చివర కోచ్ వెనుకగా LV అని కూడా రాసి ఉంటుంది. దాని అర్థం “లాస్ట్ వెహికల్” అని. ఈ రెండిటితో పాటుగా ఒక చిన్న రెడ్ లైట్ కూడా కనిపిస్తుంది. ఇది రాత్రి సమయాల్లో చివరి బోగీని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి