iDreamPost

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండానే రైల్వే జాబ్!

Railway Jobs: నేటికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబధించిన ఓ చిన్న ఉద్యోగం పొందాలన్నా బోలెడు పోటీ ఉంటుంది. అయితే రాత పరీక్షలు లేకుండా కూడా కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది.

Railway Jobs: నేటికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబధించిన ఓ చిన్న ఉద్యోగం పొందాలన్నా బోలెడు పోటీ ఉంటుంది. అయితే రాత పరీక్షలు లేకుండా కూడా కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది.

నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండానే రైల్వే జాబ్!

ప్రస్తుతం కాలంలో నిరుద్యోగుల సంఖ్యంగా ఎక్కువగా ఉంది. ఎంతో మంది యువత జాబ్ ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల పొందడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఈక్రమంలో రేయింబవళ్లు కష్టపడి చదివితే కొందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు వారికి గుడ్ న్యూస్ చెబుతుంటాయి. తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇవ్వనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేటికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబధించిన ఓ చిన్న ఉద్యోగం పొందాలన్నా బోలెడు పోటీ ఉంటుంది. అనేక రకాల పరీక్షలు  పాసన తరువాతనే చివర్లో జాబ్ కొందరికి మాత్రమే వస్తుంది. అయితే రాత పరీక్షలు లేకుండా కూడా కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. వాటికి కేవలం అకడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ప్రధానంగా భారత రైల్వే వ్యవస్థ ఇలాంట రాత పరీక్ష లేని ఉద్యోగాలను అందిస్తుంటుంది. ఇప్పటికే ఆ తరహా నోటిఫికేషన్ లు రైల్వే శాఖ ఇచ్చింది. అలానే తాజాగా రాత పరీక్ష లేకుండా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రెడీ అయ్యింది.

కొన్ని టీచర్ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.  పీజీటీ, టీజీటీ పోసటుల భర్తీకి చేయాలని ఎస్ఈసీఆర్ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టుల భర్తీ విద్యా అర్హతల ఆధారంగానే జరుగుతుంది. ఇక రైల్వే శాఖ విడుదల చేసిన పోస్టులకు తగిన అర్హతల గురించి తెలుసుకోవాలంటే..రైల్వేఅధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. అలానే ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://secr.indianrailways.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఇప్పటికే నోటిఫికేషన్ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

 అర్హత :

  • దరఖాస్తుదారులు భారతదేశ పౌరులై ఉండాలి
  •  టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి
  •  నిర్ణీత వయస్సు పరిమితిలో ఉండాలి

SEC రైల్వేలో ఖాళీల వివరాలు:

 హైస్కూల్ సెక్షన్ 1, బిలాస్‌పూర్, పీజీటీ హిస్టరీలో 1 , పీజీటీ పొలిటికల్ సైన్స్ లో 1 , టీజీటీ ఇంగ్లీష్ లో 3, టీజీటీ సంస్కృతంలో1, హైస్కూల్ సెక్షన్ 2, పీజీటీ హిస్టరీలో 1 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతలు వెబ్ సైట్ లో ఇవ్వడం జరిగింది.

పోస్టుల ఎంపిక:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో తమ పేరును నమోదు చేయించుకోవాలి. అభ్యర్థుల దరఖాస్తును రైల్వే శాఖ చెప్పిన విధానంలో నింపాలి.  అర్హతల ధృవీకరణ కోసంఒరిజినల్ సర్టిఫికెట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ , ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్, ఇతర ముఖ్యమైన పత్రాలను తీసుకురావాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి