iDreamPost

ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు.. ఎప్పటి వరకంటే?

రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు ముఖ్యగమనిక. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఏకంగా 25 ట్రైన్స్ రద్దయ్యాయి. ఎప్పటి వరకు రద్దు కానున్నాయంటే?

రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు ముఖ్యగమనిక. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఏకంగా 25 ట్రైన్స్ రద్దయ్యాయి. ఎప్పటి వరకు రద్దు కానున్నాయంటే?

ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు.. ఎప్పటి వరకంటే?

నిత్యం వేలాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. సూదూర ప్రాంతాలకు వెళ్లే వారు ట్రైన్ జర్నీనే ఎంచుకుంటారు. పండగలు, సెలవు రోజుల్లో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. మరి మీరు ఈమధ్య రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? విజయవాడ రూట్లో వెళ్లే వారికి బిగ్ అలర్ట్. విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. ఏపీలోని విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఒకటి కాదు ఏకంగా 25 రైళ్లు రద్దయ్యాయి. ట్రైన్స్ ఎప్పటి వరకు రద్దు కానున్నాయంటే?

భారీ సంఖ్యలో రైళ్లు రద్దు కావడానికి గల కారణం ఏంటంటే? విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనులు సాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను, వసతులను కల్పించేందుకు పలు అభివృద్ధి పనులను చేపట్టారు అధికారులు. దీంతో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు చేస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 24 నుంచి 28 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. 11 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ట్రాక్‌ నిర్వహణ వల్ల రైళ్లను రామవరప్పాడు స్టేషన్‌ వరకు నడుపుతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

రైళ్ల రద్దుతో ప్రయాణికులు కాస్త ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. స్కూల్స్ ప్రారంభం అవుతున్న వేళ ఊళ్లకు వెళ్లిన వారు సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఇలాంటి సమయంలో రైళ్ల రద్దు వ్యవహారం ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇక ఇటీవల చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మానవ తప్పిదాల వల్ల, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో రైళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. రైల్వే అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి