iDreamPost

Pulses Rates: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పప్పు ధరలు! ఎంతంటే..

ప్రస్తుత కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల  వాటి ఖర్చు భరించలేక ఆర్థికం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వారికి ఓ చల్లని వార్త ఒకటి బయటకు వచ్చింది.

ప్రస్తుత కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల  వాటి ఖర్చు భరించలేక ఆర్థికం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వారికి ఓ చల్లని వార్త ఒకటి బయటకు వచ్చింది.

Pulses Rates: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పప్పు ధరలు! ఎంతంటే..

నేటికాలంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల  వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో గ్యాస్ నుంచి.. అన్ని రకాల వస్తువులు భారీగా  ధరలు పలుకుతున్నాయి. ఇటీవలే టమాటాలు సామాన్యుడి కన్నీరు తెప్పించేలా రికార్డు స్థాయిలో రూ.100లకి చేరింది. ఇలా అది, ఇది అని కాకుండా ప్రతి వస్తువులు ప్రజలకు చుక్కులు చూపిస్తున్నారు. పెరిగిపోయిన ధరలతో సామాన్యులు అల్లడిపోతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ చిరు శుభవార్త ఒకటి బయటకు వచ్చింది. పప్పు ధరలు  తగ్గనున్నట్లు తెలుస్తోంది. మరీ.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఈమధ్యకాలంలో వంటనూనె, టమాటలు, గ్యాస్ సిలిండర్ వంటి అనేక నిత్యవసరాలు పెరిగి..సామాన్యుడికి గుదిబండగా మారాయి. అలానే పప్పులు కూడా తాము ఏమి తగ్గమన్నట్లు మొన్నటి వరకు అధిక ధరగా ఉన్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వారి భారీ శుభవార్తే అందిందని చెప్పాలి. వివిధ రకాల పప్పు ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఈసారి తగినంత వర్షపాతం ఉంటుందన్న అంచనాలు నేపథ్యంలో దిగుమతులు పెరుగుతున్న కారణంగా వచ్చే నెల నుంచి కంది, శనగ, మినప వంటి పప్పుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

పప్పుల ధరల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పౌరసఫరాల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశం పెట్టిన ఆయన కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే నెల నుంచి కంది, వేరు, మినప పప్పుల దిగుమతులు కూడా పెరుగుతాయని తెలిపారు. దీంతో ఇది దేశీయ సరఫరాను పెంపొందించడానికి సహాయపడుతుందని ఆమె అన్నారు. గత ఆరు నెలల నుంచి కంది, శనగ, మినప పప్పుల ధరలు స్థిరంగా ఉన్నాయని, కానీ  ఆ ధరలు కూడా అధిక స్థాయిలో ఉన్నాయని ఆమె తెలిపారు. ముఖ్యం పెసర, ఎర్ర కంది పప్పుల  రేట్లు ఎక్కువగా పెరగలేదని అన్నారు. వినియోగదారుల వ్యవహారాల విభాగం 550 ప్రధాన వినియోగ కేంద్రాల నుంచి రిటైల్ ధరలను సేకరిస్తుందని,ఈసారి వానాలు కూడా బాగానే పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసిందని కార్యదర్శి పేర్కొన్నారు.

దేశీయ లభ్యతను పెంచడానికి రిటైల్ ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని ఆమె స్పష్టం చెప్పారు. శనగ పప్పు కిలో 60 రూపాయలకు అమ్మాలన్న ప్రభుత్వ పథకం సామాన్యులకు ఊరటనిస్తోందని ఆమె పేర్కొన్నారు. గతేడాది భారతదేశం దాదాపు 6 లక్షల టన్నుల మినపపప్పు దిగుమతి చేసుకుందని, రానున్న రోజుల్లో మంచి వర్షాల కారణంగా కూరగాయల ధరలూ తగ్గుతాయని నిధి ఖరే అన్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ వార్త సామాన్యులకు శుభవార్తే అని చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి