iDreamPost

సామాన్యులకు గుడ్ న్యూస్.. 54 నిత్యావసరం మందుల ధరలు తగ్గింపు!

Medicines Price: వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గుడ్ న్యూస్. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు తగ్గాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Medicines Price: వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గుడ్ న్యూస్. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు తగ్గాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సామాన్యులకు గుడ్ న్యూస్.. 54 నిత్యావసరం మందుల ధరలు తగ్గింపు!

మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఏదైనా చిన్న అనారోగ్యం చేస్తే..నేటికాలంలో వైద్య చికిత్సలు భరించడం కష్టం. చాలా కుటుంబాలు అనారోగ్యం బారిన పడినప్పుడు చికిత్సల కోసం భారీగా ఖర్చుపెట్టి..ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇది ఇలా ఉంటే..నిత్యావసరంగా వాడే చిన్న చిన్న మందులు కూడా భారీగా ధర ఉంటున్నాయి. ఈ క్రమంలోనే కనిపించకుండానే సామాన్యుడికి మందుల ద్వారా చాలా ఖర్చు అవుతుంది. ఇలా వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఊరట నిచ్చింది. నేటి నుంచి 54 నిత్యావసర మందుల రేట్లు తగ్గనున్నాయి. మరి..వాటి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గుడ్ న్యూస్. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు తగ్గాయి. మల్టీ విటమిన్లలతో పాటు డయాబెటీస్, గుండె, చెవి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే  ఔషధాల ధరలు తగ్గించారు. దీంతో సామాన్యుల ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ 124వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈక్రమంలోనే అనేక అవసరమైన మందుల ధరలను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో విక్రయించే నిత్యావసర మందుల రేట్లను ఎన్‌పిపిఎ నిర్ణయిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. వీటిని సామాన్య ప్రజలు ఉపయోగిస్తున్నారు.

ఈ సమావేశంలో 54 నిత్యావసర మందుల తయారీ, 8 ప్రత్యేక మందుల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక తగ్గిన మందులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ సమావేశంలో ఎన్‌పిపిఎ నిర్ణయించిన 54 ఔషధాల ధరల్లో షుగర్ వ్యాధి, గుండె, యాంటీబయాటిక్స్, విటమిన్ డి, మల్టీ విటమిన్లు, చెవి  వంటి సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. వీటితో పాటు 8 ప్రత్యేక ఫీచర్ల ఉత్పత్తుల ధరలపై కూడా ఎన్‌పిపిఎ ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంది. గత నెల ప్రారంభంలో కూడా కేంద్ర  ప్రభుత్వం పలు రకాల మందుల రేట్లను తగ్గించింది. గత నెలలో సాధారణంగా ఉపయోగించే 41 మందులు, 6 ప్రత్యేక ఔషధాల రేట్లను తగ్గించారు. వీటితో కాలేయ మందులు, గ్యాస్‌, అసిడిటీ, పెయిన్‌ కిల్లర్స్‌, అలర్జీ మందులు కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఎన్పీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది ప్రజలు ప్రయోజనం పొందవచ్చని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి