iDreamPost

ప్రతి నెలా 9 వేలు కావాలా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో చేరండి!

  • Published May 26, 2024 | 5:45 PMUpdated May 26, 2024 | 5:45 PM

ప్రతిఒక్కరూ సంపాదించాల్సిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్స్‌ కింద ఎంతో కొంత పొదుపు చేయాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీస్ లో అధ్బుతమైన మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

ప్రతిఒక్కరూ సంపాదించాల్సిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్స్‌ కింద ఎంతో కొంత పొదుపు చేయాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీస్ లో అధ్బుతమైన మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి అందుబాటులోకి వచ్చింది.

  • Published May 26, 2024 | 5:45 PMUpdated May 26, 2024 | 5:45 PM
ప్రతి నెలా 9 వేలు కావాలా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో చేరండి!

 ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. కానీ, ప్రస్తుత కాలంలో ఇంట్లో​ ఎంతమంది కష్టపడి సంపాదిస్తున్న వచ్చిన ఆదాయం మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతునే ఉంది. ఈ క్రమంలోనే భవిష్యత్ గురించి ఆలోంచించేవారు.. నెల నెలా ఎంతో కొంత సేవింగ్స​ కింద పొదుపు రూపంలో దాచుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకోసం వివిధ బ్యాంకుల్లో పొదుపు పేరిట అనేక పథకాలను అందుబాటులోకి ఉన్నాయి. కానీ వాటిన్నింటి కన్నా  పోస్టాఫీస్ లో సేవింగ్స్‌  అనేది చాలా బెస్ట్‌ అనే చెప్పవచ్చు. పైగా ఇది సురక్షితమైనది. ఇక ఇందులదదో ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, ప్రభుత్వ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఈ పథకంలో మీ పెట్టుబడులు మంత్లీ ఇన్ కమ్ గా ఎలా మీకు ఆదాయాన్ని అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజుల్లో ఎంత సంపాదించిన అందులో ఎంతో కొంత సేవింగ్స్‌ చేయాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఇప్పడు పోస్టాఫీస్‌ లో మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS) బెస్ట్‌ ఆప్షన్‌ అవతుంది. ఇందులో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ప్రభుత్వ మద్దతు అందిస్తుంది. ఈ పథకం మీ పెట్టుబడులను మంత్లీ ఇన్‌కమ్‌ సోర్స్‌గా ఎలా మారుస్తుందో? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. నేషనల్ సేవింగ్స్‌ స్కీమ్‌ని చాలామంది సురక్షితంగా నమ్ముతారు. అలాంటి వారు కోసం పోస్టాఫీస్ ద్వారా POMIS పథకం అందరికి అందుబాటులో ఉంది. ఇందులో  సింగిల్‌, జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. పైగా ఇందులో ముగ్గురు పెద్దలకు జాయింట్‌ అకౌంట్‌ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా.. మైనర్‌లు, సొంతంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించలేని వారి కోసం గార్డియన్లు అకౌంట్‌ మేనేజ్‌ చేయవచ్చు.

అయితే ఈ పథకంలో10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పేరు మీద POMISతో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. అలాగే అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తేదీ నుంచి నెల పూర్తయిన తర్వాత నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ అందుకుంటారు. దీంతో పాటు ప్రతి నెలా అందుకోవాల్సిన వడ్డీని అకౌంట్‌ హోల్డర్‌ క్లెయిమ్ చేయకపోతే, అకౌంట్‌లో ఉండే వడ్డి పై ఎటువంటి అదనపు వడ్డీ లభించదని గుర్తించాలి. ఒకవేళ అనుకోకుండా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్‌ చేస్తే, ఆ మొత్తాన్ని తిరిగి పొందుతారు. అయితే దీనిలో వడ్డీ ఆటోమేటిక్‌గా సేవింగ్స్‌ అకౌంట్‌లో క్రెడిట్‌  అవుతుంది. ఇక ఈ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి వస్తుంది. అయితే ఈ స్కీమ్‌ లో కనీసం రూ.1000 లతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా సింగిల్ అకౌంట్ అయితే రూ.9లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్ లోని ఉన్న వారందిరికి పెట్టుబడిలో సగభాగం ఉంటుంది. ఇకపోతే ఒక వ్యక్తి ఓపెన్ చేసిన అన్ని అకౌంట్స్ లో కూడా పెట్టబడి మొత్తం రూ. 9లక్షలు మించకూడదు. అలాగే మైనర్ తరపున గార్డియన్ గా ఉంటే ఆ అకౌంట్ లిమిట్ వేరుగా ఉంటుంది.

ఇక డిపాజిట్‌ తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు డిపాజిట్ ను విత్ డ్రా చేయడానికి వీలు లేదు. అలాగే అకౌంట్‌ తెరిచిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత లేదా 3 సంవత్సరాలకు ముందు అకౌంట్ క్లోజ్‌ చేస్తే ప్రిన్సిపుల్ అమౌంట్ నుంచి 2 శాతం కట్ చేస్తారు.  ఇక  సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌, అప్లికేషన్‌ ఫామ్‌ను సమర్పించడం ద్వారా అకౌంట్‌ను ప్రీమెచ్యూర్‌గా క్లోజ్‌ చేయవచ్చు. అంతేకాకుండా.. సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌, అప్లికేషన్‌ ఫామ్‌ అందజేయడం ద్వారా 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత అకౌంట్‌ క్లోజ్‌ చేసుకోవచ్చు. అలాగే  అకౌంట్‌ హోల్డర్ మెచ్యూరిటీకి ముందే మరణిస్తే కూడా క్లోజ్‌ చేయవచ్చు. దీంతో పాటు నామినీ చట్టపరమైన వారసులకు మొత్తం తిరిగి చెల్లిస్తారు. రీఫండ్‌ చేసిన ముందు నెల వరకు వడ్డీ చెల్లిస్తారు. రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 9250 వరకు వడ్డీ రూపంలో పొందొచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులు మీకు వస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి