iDreamPost

పబ్‌లో గబ్బు పనులు.. అమ్మాయిలతో కలిసి యువకులు..!

పబ్‌లో గబ్బు పనులు.. అమ్మాయిలతో కలిసి యువకులు..!

హైదరాబాద్‌ మహా నగరంలో పబ్ కల్చర్ పెచ్చుమీరుతోంది. నిబంధనలును ఉల్లంఘిస్తూ కొన్ని పబ్బులు హద్దులు దాటుతున్నాయి. కొన్ని పబ్బుల్లో అర్ధనగ్న నృత్యాలు, అశ్లీల డ్యాన్స్ వంటి జరుగుతున్నాయి. అలానే అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి.  కొన్ని నెలల క్రితం పబ్బుకెళ్లిన యువతిపై కొందరు యువకులు అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా పోలీసులు తరచూ పబ్బులపై దాడులు నిర్వహింస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్‌ ప్రాంతంలో హంటర్ రెస్ట్రో బార్ అండ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహంచారు. ఎలాంటి అనుమతులు లేకుండా పబ్ నిర్వహించడంతో పాటు యువతులతో అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ గుర్తించారు.

హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లోని హంటర్ రెస్ట్రో బార్ అండ్ పబ్‌లో నిబంధనలు ఉల్లంఘింటారని పోలీసులు తెలిపారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడంచారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఎస్సై మహ్మద్ ఖలీల్ బాషా ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ, లిక్కర్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దాడుల్లో మెుత్తం 30 మందిని  పోలీసులు అరెస్టు చేశారు. పబ్ లో 10 మంది యువతులు డ్యాన్సులు  చేస్తుండగా, కొందరు యువకులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు. నిబంధనలు ఉల్లంఘించారని బార్ యజమాని కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బార్ అండ్ పబ్ నిర్వహించేందుకు సరైన అనుమతి కూడా లేకపోవడంతో పబ్ నిర్వహాకులను అరెస్టు చేశారు. వీరిలో ఈవెంట్ ఆర్గనైజర్ ఓమర్ బిన్ అబ్దుల్లా, పబ్‌ లోని క్యాష్ కౌంటర్ లో  పని చేస్తున్న సిద్ధార్థ్, డీజే ఆపరేటర్ కె. కృష్ణలు ఉన్నారు. వారితో పాటు 10 మంది అమ్మాయులు, 16 మంది యువకులను కూడా అరెస్టు చేశారు. నిందితులను విచారణ నిమిత్తం ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు. నగరంలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి