iDreamPost

Hot Star OTT: యక్షిణి నిర్మాతలకు షాక్.. సిరీస్ వచ్చిన రోజే ఆపేయాలంటూ..!

  • Published Jun 14, 2024 | 4:32 PMUpdated Jun 14, 2024 | 4:32 PM

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు నుంచి యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపివేయాలంటూ ఢిల్లీ హై కోర్టులో పాకెట్ ఎఫ్ఎమ్ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు నుంచి యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపివేయాలంటూ ఢిల్లీ హై కోర్టులో పాకెట్ ఎఫ్ఎమ్ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

  • Published Jun 14, 2024 | 4:32 PMUpdated Jun 14, 2024 | 4:32 PM
Hot Star OTT: యక్షిణి నిర్మాతలకు షాక్.. సిరీస్ వచ్చిన రోజే ఆపేయాలంటూ..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఇప్పటివరకు ఎన్నో మంచి మంచి సిరీస్ లను, సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఇలా అనేక భాషల సినిమాలు, సిరీస్ లతో ఎప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తునే ఉంటుంది, ఈ క్రమంలో తాజాగా హాట్ స్టార్ లో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ యక్షిణి. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఆపేయాలి అంటూ.. ఢిల్లీ హై కోర్టులో పాకెట్ ఎఫ్ఎమ్ పిటిషన్ వేసింది. అసలు ఏమై ఉంటుంది. దానికి గల కారణాలు ఏమై ఉంటాయి. ఈ విషయాలను తెలుసుకుందాం.

తన ఆడియో సిరీస్ కాపీ రైట్స్ న.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉల్లంఘించిందని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పై.. పాకెట్ ఎఫ్ఎమ్ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు దీనిపై వెంటనే స్పందించి.. హాట్ స్టార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆడియో ప్లాట్ ఫార్మ్ పాకెట్ ఎఫ్ఎమ్.. గురించి అందరికి తెలిసిందే. ఇందులో అనేక రకాలుగా కంటెంట్ ఉంటుంది. ఇప్పటికే దీనిలో ఎన్నో సిరీస్ లు చాలా పాపులర్ అయ్యాయి. వాటిలో యక్షిణి ఆడియో సిరీస్ కూడా ఒకటి. దీనిని పాకెట్ ఎఫ్ఎమ్ పెయిడ్ కస్టమర్స్ కు మాత్రమే అందిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి హక్కులు.. పాకెట్ ఎఫ్ఎమ్ కలిగి ఉంది. ఇక ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. సేమ్ నేమ్ తో.. యక్షిణి వెబ్ సిరీస్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాకెట్ ఎఫ్ఎమ్ .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి యక్షిణిని తొలగించాలంటూ జూన్ 11 న ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది.

Yakshini movie

ఇక దీనికి సంబంధించిన విషయాన్నీ.. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన సమాధానాన్ని తెలియజేయవలసిందిగా ఆదేశించింది. అయితే పాకెట్ ఎఫ్ఎమ్ లో వెయ్యికి పైగా ఎపిసోడ్స్ తో యక్షిణి సిరీస్ కొనసాగుతుంది. ఇక ఇప్పుడు హాట్ స్టార్ లో ఆరు ఎపిసోడ్స్ తో యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇలా పాకెట్ ఎఫ్ఎమ్ పిటిషన్ వేయడంతో.. యక్షిణి నిర్మాతలకు షాక్ తగిలినట్టు అయింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి