iDreamPost

రైతులకు గుడ్ న్యూస్.. ఆ తేదీన ఖాతాల్లోకి PM Kisan డబ్బులు

రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే అప్ డేట్. పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ నెల ఆ తేదీనాడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.

రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే అప్ డేట్. పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ నెల ఆ తేదీనాడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.

రైతులకు గుడ్ న్యూస్.. ఆ తేదీన ఖాతాల్లోకి PM Kisan డబ్బులు

దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికసాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఇందుకోసం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలని.. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చాటి చెప్పేందుకు పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి ప్రభుత్వాలు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి 6 వేల చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమచేస్తున్నది. ఇప్పటి వరకు 16 విడతల్లో నిధులు జమ చేశారు. 17వ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ తేదీనాడు పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పంటపెట్టుబడి సాయం కోసం అందించే పీఎం-కిసాన్‌ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఫిక్స్ అయ్యింది. జూన్‌ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అంటే ఇంకో మూడు రోజుల్లో రైతులు పీఎం కిసాన్ డబ్బును పొందనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ శనివారం వెల్లడించారు. కాగా మూడోసారి భారత ప్రధానిగా భాధ్యతలు చేపట్టిన మోడీ పీఎం కిసాన్‌ 17వ విడత చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు మూడు విడతల్లో రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలి. ఈ పథకం ద్వారా లబ్ధిపొందలేరు.

ఈ-కేవైసీ ఇలా చేసుకోండి:

  • పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్  pmkisan.gov.in ను సందర్శించాలి.
  • ఈ-కేవైసీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ 12 అంకెలున్న ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
  • సెర్చ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు మీ ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి