iDreamPost

ఇంకా హైదరాబాద్‌ గురించేనా.. అంటే ఐదేళ్లలో APకి చేసింది ఏం లేదా బాబు?

  • Published Aug 18, 2023 | 11:20 AMUpdated Aug 18, 2023 | 11:20 AM
  • Published Aug 18, 2023 | 11:20 AMUpdated Aug 18, 2023 | 11:20 AM
ఇంకా హైదరాబాద్‌ గురించేనా.. అంటే ఐదేళ్లలో APకి చేసింది ఏం లేదా బాబు?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. ఓవైపు జనాలు, సర్వే సంస్థలన్ని ఔర్‌ ఏక్‌ బార్‌ జగన్‌ సర్కార్‌ (మరోసారి జగన్‌ సర్కారే) అని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పాలన, అభివృద్ధి ఫలాలు అందిస్తూ.. జనాల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సీఎం జగన్‌. ఆయన క్రేజ్‌ చూస్తే మతి పోతుంది. రోజురోజుకు ప్రజాభిమానం పెరుగుతందే తప్ప వీసమెత్తు తగ్గడం లేదు. జగన్‌ క్రేజ్‌ చూస్తే విపక్షాలకు నిద్ర పట్టడం లేదు. ఏం చేసైనా సరే.. జగన్‌ ప్రతిష్టను దిగజార్చాలని కంకణం కట్టుకున్నాయి. కానీ విపక్షాల రాక్షస ప్రయత్నాలను జనాలే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఏం చేయాలో పాలుపోక.. పిచ్చి ప్రేలాపణలు చేస్తూ.. నవ్వుల పాలవుతున్నారు విపక్ష నేతలు.

పైగా జగన్‌ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను పంచుడు పథకాలంటూ ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ఏపీకి ఒక్క పరిశ్రమ రాలేదని.. వచ్చినవి కూడా వెనక్కి వెళ్లాయని విమర్శలు చేశారు. వారి నోరు మూయించేలా విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించి.. దేశ విదేశాల నుంచి లక్షల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చేలా చేశారు సీఎం జగన్‌. ఇక అప్పటి వరకు పరిశ్రమలు, పెట్టుబడుల గురించి విమర్శించిన పచ్చ బ్యాచ్‌ మళ్లీ నోరు తెరిస్తే ఒట్టు.

ప్రస్తుతం జగన్‌ విమర్శించడానికి ఏమి లేక.. తమ డప్పు తామే కొట్టుకుంటున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆయన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన ఏపీ నాయకుడో లేక తెలంగాణ నాయకుడో జనాలకు అర్ధ కావడం లేదు. రాష్ట్రం విడిపోయాక కూడా హైదరాబాద్‌ ప్రస్తావన లేకుండా మాట్లాడలేకపోతున్నారు చంద్రబాబు. నోరు తెరిస్తే.. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానంటారు.. ఐటీ నేనే తెచ్చానంటారు. కానీ ఐదేళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన ప్రగతి.. తెచ్చిన పరిశ్రమల గురించి మాత్రం ఎక్కడా ఒక్క మాట మాట్లాడరు. కారణం ఏపీకి ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చేసినప్పటికి.. అమరావతి పేరుతో గ్రాఫిక్‌ డిజైన్లు గీసి.. నానా హంగామా చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. కానీ ఒక్క శాతం కూడా అభివృద్ధి చేయలేదు.. పరిశ్రమలు రాలేదు.

అందుకే ఇప్పటికి కూడా చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్‌ అంటాడు తప్ప.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా తాను ఏపీకి ఏం చేశాడో మాత్రం చెప్పుకోలేడు.. ఎందుకంటే ఆయన చేసింది ఏం లేదు. పైగా ప్రత్యేక హోదా వద్దని కేంద్రానికి చెప్పింది ఆయనే.. ప్యాకేజీ కావాలన్నది ఆయనే. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నింటిని పచ్చ బ్యాచ్‌ దుర్వినియోగం చేసింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. అందుకే ఇంకా హైదరాబాద్‌ అంటున్నాడు. కానీ ఆల్రేడీ అభివృద్ధి పథంలో ఉన్న హైదరాబాద్‌ను కొత్తగా మీరు డెవలప్‌ చేయడం ఏంటి.. ఆ విషయం అలా ఉంచితే ఈ ఐదేళ్లు ఏపీకి చేసింది ఏం లేదా బాబు అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రా ప్రజలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి