iDreamPost

అమూల్ బాటలో మరో పాల కంపెనీ.. ధరలు పెంచేస్తూ నిర్ణయం!

  • Published Jun 14, 2024 | 7:26 PMUpdated Jun 14, 2024 | 7:26 PM

ఇటీవలే ప్రముఖ పాల కంపెనీ అముల్ పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి సామాన్య ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే బాటాలోనే మరో ప్రముఖ పాల కంపెనీ పాల ధరలను పెంచేసింది.

ఇటీవలే ప్రముఖ పాల కంపెనీ అముల్ పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి సామాన్య ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే బాటాలోనే మరో ప్రముఖ పాల కంపెనీ పాల ధరలను పెంచేసింది.

  • Published Jun 14, 2024 | 7:26 PMUpdated Jun 14, 2024 | 7:26 PM
అమూల్ బాటలో మరో పాల కంపెనీ.. ధరలు పెంచేస్తూ నిర్ణయం!

ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడంటంతో.. ఆహార పదార్థాల పై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పప్పులు, ఉప్పులు, కూరగాయలు అని తేడా లేకుండా అన్ని రకాల వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఏదీ కొనుగోలు చేయాలన్న భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే దేశంలో ప్రముఖ పాల కంపెనీ అయిన అమూల్ ఒక్కసారిగా పాల ధరలు పెంచడంతో.. సామాన్యులకు ఊహించని షాక్ తగిలినట్టు అయ్యిది. ఇక ఇప్పటికే ఈ పాల ధరలు ఈనెల 3వ తేదీ నుంచి అములోకి వచ్చేయనే విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలోనే మరో ప్రముఖ పాల కంపెనీ ధరలు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే ప్రముఖ పాల కంపెనీ అముల్ పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి సామాన్య ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు  ఇదే బాటాలోనే ప్రముఖ పాల కంపెనీ పరాగ్ మిల్క్ కూడా పాల రేటులను పెంచుతున్నట్లు ప్రకటించి. ఈ క్రమంలోనే తాజాగా పారాగ్ పాల ధరలను పెంచింది. దీంతో ఇక నుంచి మార్కెట్ లో ఒక లీటరు పరాగ్ పాలకు రూ.2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఈ కంపెనీ కి చెందిన రెండు రకాల ప్యాక్‌ల ధరలను పెంచేసింది. కనుక ఇక నుంచి మార్కెట్లలో పరాగ్ టోన్డ్ మిల్క్ రూ.54కి బదులు రూ.56లకు కొనుగోలు చేయవలసి ఉంటుంది.అలాగే పరాగ్ గోల్డ్ ఒక లీటర్ ధర రూ.66 నుంచి రూ.68కి పెరిగింది. అంతేకాకుండా.. పరాగ్ మార్కెట్‌లో లభ్యమయ్యే 1 లీటర్ పాల ప్యాక్‌ల ధరలను కూడా పెంచినట్లు పరాగ్ డెయిరీ జీఎం వికాస్ బలియన్ తెలిపారు. దీంతో పాటు అరలీటర్ పాల ప్యాకెట్లపై కూడా ఒక రూపాయి పెంచడం జరిగింది.

ఇక పరాగ్ గోల్డ్ హాఫ్ లీటర్ విషయానికొస్తే.. దీని ధర ప్రస్తుతం రూ., 33 ఉండగా ఇక నుంచి దీని ధర మార్కెట్ లో 34కు ఉంటుంది. అలాగే పరాగ్ స్టాండర్డ్ హాఫ్ లీటర్ ధర ఇప్పుడు రూ.30కి బదులుగా రూ.31 చేయడం జరిగింది. ఇక అరలీటర్ టోన్డ్ మిల్క్ ధర రూ.27 నుంచి రూ.28లకు మార్కెట్ లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వేడి కారణంగా పాల ఉత్పత్తి తగ్గుతుందని, పైగా జూన్ 2 నుంచి అమూల్ సహా ఇతర పాల ఉత్పత్తి కంపెనీలు ధరలు పెంచాయని పరాగ్ డెయిరీ జనరల్ మేనేజర్ తెలిపారు. ఇక పరాగ్‌ కంపెనీ నుంచి ప్రతి రోజూ దాదాపు 33 వేల లీటర్ల పాలు సరఫరా అవుతోంది. రైతులు కూడా పాల పెంచడంతో.. తమ కంపెనీ కూడా పాల ధరను పెంచాల్సి వచ్చిందని వెల్లడించింది. మరి, పరాగ్ కంపెనీ కూడా ధరలు పెంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి