iDreamPost

పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు.. షకీల్, రాహిల్‌పై లుకౌట్ నోటీసు

డిసెంబర్ 24న తప్పతాగి.. పంజాగుట్ట ఫ్లై ఓవర్ సమీపంలో యాక్సిడెంట్ చేశాడో వ్యక్తి. అతడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు జరిగిన ప్రయత్నాలు సినిమాను తలపించాయి. ఇప్పుడు ఈ కేసులో కీలక అప్ డేట్ వచ్చింది.

గత ఏడాది డిసెంబర్ నెల చివరిలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ నిజామాబాద్ జిల్లా భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ తప్ప తాగి మద్యం సేవించి యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటన ప్రజాభవన్ వద్ద కాదూ.. పంజాగుట్టలో జరిగింది. అనంతరం అక్కడి నుండి వెంటేనే దుబాయ్‌కి పారిపోయాడు. అప్పటికే సోహెల్ తండ్రి అప్పటికే దుబాయ్‌‌లో ఉన్నాడు. కొడుకును ఈ కేసు నుండి తప్పించడానికి, మరొకరిని ఈ క్రైమ్‌లో నిందితుడ్ని చేసేందుకు, ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను పోలీసుల నుండి తప్పించుకుని తిరిగేందుకు షకీల్ అక్కడే ఉండి మానటరింగ్ చేశాడు’ అని వెల్లడించారు.

‘ఇప్పటి వరకు 15 మందిని నిందితులుగా గుర్తించాం. ఈ కేసులో ఏ 13గా ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్ స్పెక్టర్ దుర్గారావును ఏపీలోని గుంతకల్లులో అరెస్టు చేశాం. కోర్టులో హాజరు పరిచాం. అతడ్ని మరింత విచారిస్తున్నాం. ఇంకా ఈ కేసులో ఏ2గా ఉన్న అబ్దుల్ (డ్రైవింగ్ చేసింది తనే అని చెప్పేందుకు ఒప్పుకున్నాడు)ను అదుపులోకి తీసుకున్నాం. ఈ కేసులో మరి కొంత మంది తప్పించుకుని తిరుగుతున్నారు. ఏ 7 షేక్ సోహేల్, అర్బజ్ ఖాన్‌లను అరెస్టు చేశాం. యాక్సిడెంట్ చేసి తప్పించుకున్న రాహిల్ అమీర్.. దేశం విడిచి పారిపోయాడు. ఏ 3 మాజీ ఎమ్మెల్లే షకీల్ కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఏ 4 షాహీద్.. వీరి బంధువు, ఏ5 సయ్యద్ జకియా రెహమాన్.. ఈ నలుగురు ఇండియా బయట ఉన్నారు. ఈ నలుగురిపై నలుగురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశాం’ అని పేర్కొన్నారు. అలాగే భోదన్ మాజీ ఇన్ స్పెక్టర్ బరిగెల ధన్ పాల్ ప్రేమ్ కుమార్ ను అరెస్టు చేశామని వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి