iDreamPost

T20 World Cup: మ్యాచ్‌ ఆడకుండానే పాకిస్థాన్‌ను ఇంటికి పంపిన USA

  • Published Jun 15, 2024 | 8:28 AMUpdated Jun 15, 2024 | 8:28 AM

Pakistan, T20 World Cup 2024, USA vs IRE: గ్రూప్‌-ఏలో టీమిండియా తర్వాత నంబర్‌ 2 స్ట్రాంగ్‌ టీమ్‌గా ఉన్న పాకిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అది కూడా అమెరికా మ్యాచ్‌ ఆడకుండానే పాక్‌ను ఇంటికి పంపింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే.. పూర్తిగా చదివేయండి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి.. ఇప్పటికే న్యూజిలాండ్‌, శ్రీలంక లాంటి పెద్ద జట్లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌ కూడా ఇంటి బాట పట్టింది. గ్రూప్‌-ఏలో టీమిండియా తర్వాత బలమైన జట్టుగా ఉన్న పాకిస్థాన్‌ను యూఎస్‌ఏ ఇంటికి పంపింది. తమ తొలి మ్యాచ్‌లో అమెరికాపై ఓడిపోవడం పాక్‌ కొంపముంచింది. అయితే.. అమెరికా తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ ఆడకుండానే పాకిస్థాన్‌ను ఇంటికి పంపడం విశేషం.

శుక్రవారం రాత్రి యూఎస్‌ఏ, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది.. దీంతో పాక్‌ అవుట్‌ ఆఫ్‌ ది టోర్నీ అయింది. సూపర్‌ 8కు చేరకుండానే.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఎస్‌ఏ వర్సెస్‌ ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు అవ్వకముందు.. అమెరికా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. యూఎస్‌ఏ ఐర్లాండ్‌ చేతిలో ఓడిపోతే.. పాకిస్థాన్‌కు సూపర్‌ 8 అవకాశాలు ఉండేవి. కానీ, అసలు మ్యాచే జరగలేదు. దీంతో రెండు జట్లుకు చెరొక పాయింట్‌ ఇచ్చారు. ఐదు పాయింట్లతో యూఎస్‌ఏ సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. ఇక పాకిస్థాన్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఎంత భారీ తేడాతో నెగ్గినా.. ఇంటి బాటపట్టాల్సిందే.

తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ చేతిలో ఓడిన పాకిస్థాన్‌ తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండు వరుస ఓటములతో ఆ జట్టు సూపర్‌ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో కలిసి వచ్చిన అదృష్టం ఇప్పుడు పాకిస్థాన్‌కు కలిసి రాలేదు. ఆ టోర్నీలో సౌతాఫ్రికా చిన్న టీమ్‌ చేతిలో ఓడిపోవడంతో పాక్‌ సెమీస్‌కు చేరింది. ఆ తర్వాత ఫైనల్‌ కూడా ఆడింది. కానీ, ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి మాత్రం అలాంటి అదృష్టం ఏం కలిసి రాలేదు.. గ్రూప్‌ దశలోనే నిష్ర్కమించి.. విమర్శలు ఎదుర్కొంటోంది. మరి పాక్‌ ఇంటి బాట పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి