iDreamPost

AUS vs PAK: షాహీన్ అఫ్రిదీ-లబుషేన్‌ మధ్య గొడవ! టెస్ట్‌ క్రికెట్‌ మజా అంటే ఇదే..

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో మార్నస్ లబుషేన్-షాహీన్ అఫ్రిదీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో మార్నస్ లబుషేన్-షాహీన్ అఫ్రిదీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

AUS vs PAK: షాహీన్ అఫ్రిదీ-లబుషేన్‌ మధ్య గొడవ! టెస్ట్‌ క్రికెట్‌ మజా అంటే ఇదే..

మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన పాక్ కు తొలి పోరులోనే ఘోర పరాభవం ఎదురైంది. ఫస్ట్ టెస్ట్ లో 360 పరుగుల తేడాతో ఓటమిపాలైన పాక్.. వరల్డ్ కప్ దారుణ వైఫల్యాన్ని కొనసాగించింది. ఇక రెండో టెస్టు లో గెలిచి.. సిరీస్ ను సమం చేయాలని భావించిన పాక్, అందుకు తగ్గట్లుగానే బౌలింగ్ చేస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్థాన్. నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు పాక్ బౌలర్లు. మరీ ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ఆసీస్ బ్యాటర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే మార్నస్ లబుషేన్-షాహీన్ అఫ్రిదీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పాక్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ.. పరుగుల వేగాన్ని తగ్గిస్తున్నారు. గత మ్యాచ్ లో సెంచరీ హీరో వార్నర్(38) తక్కువ పరుగులకే వెనుదిరగగా.. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మార్నస్ లబుషేన్ ఆచితూచి ఆడుతున్నాడు. మరో బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా(42) పరుగులు చేసి.. వార్నర్ అవుటైన వెంటనే పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్ లో పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. అతడితో పాటుగా మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో.. పరుగుల వేగం తగ్గింది. లబుషేన్-స్టీవ్ స్మిత్ లు ఇద్దరు కలిసి 57 బంతుల్లో 5 పరుగులు చేశారంటేనే పాక్ బౌలింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

fight between afridi labuchane

ఇక ఈ బాక్సిండే టెస్ట్ లో లబుషేన్-షాహీన్ అఫ్రిదీ మధ్య ఆసాంతం టగ్ ఆఫ్ వార్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు అఫ్రిదీ 5 మెయిడెన్ ఓవర్లు వేశాడు. కాగా.. 39వ ఓవర్లలో లబుషేన్ ను కవ్వించే ప్రయత్నం చేశాడు షాహీన్. ఈ ఓవర్ చివరి బంతికి పరుగుతీస్తున్న క్రమంలో అతడికి అడ్డుగా తన భుజం పెట్టబోయి.. మళ్లీ వెనక్కి గుంజుకున్నాడు. అలాగే తన నోటికి పనిచెబుతూ.. ఏవో మాటలు అన్నాడు. దానికి లబుషేన్ సైతం సమాధానం ఇచ్చాడు. ఒక్కసారి కాదు.. ఈ మ్యాచ్ లో ఎన్నోసార్లు షాహీద్ అతడితో గొడవపెట్టుకోవాలని చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఒక నెటిజన్ వెరైటీగా కామెంట్ చేశాడు. ఇలాంటి మూమెంట్స్ కోసమే నేను నా డేటా రిచార్జ్ చేసుకుంటున్నాను అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఆసీస్ ఆటగాళ్లకు తగ్గట్లుగానే స్లెడ్జింగ్ చేస్తున్నావ్ షాహీన్ అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. టెస్ట్‌ క్రికెట్‌ మజా అంటే ఇదే అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు మాత్రమే చేసింది. క్రీజ్ లో లబుషేన్(44), ట్రావిస్ హెడ్(9) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, జమాల్,ఆఘ సల్మాన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. మరి లబుషేన్-షాహీన్ అఫ్రిదీ మధ్య జరిగిన కవ్వింపులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి