iDreamPost

సడెన్ గా OTTలోకి.. ఆంజనేయుడి స్ఫూర్తితో తీసిన హాలీవుడ్ చిత్రం!

OTT Releases- Hollywood Movie: ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ గురిచే చర్చ జరుగుతోంది. పైగా ఆ మూవీని ఆంజనేయుడి స్ఫూర్తితో తీసినట్లు చెప్తున్నారు. ఆ మూవీ ఓటీటీ వివరాలు మీకు తెలుసా?

OTT Releases- Hollywood Movie: ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఒక యాక్షన్ థ్రిల్లర్ గురిచే చర్చ జరుగుతోంది. పైగా ఆ మూవీని ఆంజనేయుడి స్ఫూర్తితో తీసినట్లు చెప్తున్నారు. ఆ మూవీ ఓటీటీ వివరాలు మీకు తెలుసా?

సడెన్ గా OTTలోకి.. ఆంజనేయుడి స్ఫూర్తితో తీసిన హాలీవుడ్ చిత్రం!

ఓటీటీలో యాక్షన్ చిత్రాలు చూసే అభిమానులు పెరిగిపోయారు. తెలుగులో కూడా హాలీవుడ్ చిత్రాలకు అభిమానులు కోట్లలో ఉన్నారు. ఎందుకంటే వారికి హాలీవుడ్ వాళ్లు తీసే యాక్షన్ సీక్వెన్స్ అమితంగా నచ్చుతుంది. కానీ, సౌత్ లో కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో చిత్రాలు వస్తున్నాయి. వాటికి పాన్ వరల్డ్ స్థాయిలో అప్లాజ్ కూడా దక్కుతోంది. కానీ, పాత అలవాటు కదా.. ఇంకా హాలీవుడ్ చిత్రాలు చూసే అలవాటు మన వాళ్లకి పోలేదు. అలాంటి వారికోసం ఓటీటీలోకి ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ వస్తోంది. ఈ మూవీని మీరు తప్పకుండా చూడాలి అనడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి. మూవీ చూశాక మాత్రం ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ చూశామనే భావన కలుగుతుంది.

ఇప్పుడు చెప్పుకుంటున్న మూవీ మరేదో కాదు.. హాలీవుడ్ లో అదరగొట్టిన మంకీ మ్యాన్ చిత్రం. ఈ మూవీని చూడటానికి రెండు కారణాలు అనుకున్నాం కదా. అవేంటంటే.. ఒకటి ఈ చిత్రాన్ని హనుమంతుడి స్ఫూర్తితో తెరకెక్కించినట్లు చెబుతున్నారు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే.. ఈ మంకీమ్యాన్ మూవీలో లైఫ్ ఆఫ్ పై ఫేమ్ దేవ్ పటేల్ ఉన్నాడు. అంతేకాకుండా హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించింది. అవన్నీ కాకుండా.. మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్న చిత్రం. ప్రతి సీన్ కు మీరు వావ్ అంటూ ఉండాల్సిందే. నిజానికి ఈ మూవీ ఇండియాలో కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ ఇబ్బందుల దృష్ట్యా ఈ చిత్రాన్ని భారత్ మినహా అన్ని దేశాల్లో విడుదల చేశారు.

ఇండియాలో కూడా ఈ నెల 26న ఈ మంకీ మ్యాన్ చిత్రం విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. కానీ, ఎప్పుడు అనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. బుక్ మై షో యాప్ లో కూడా 2024లో రిలీజ్ అంటున్నారు కానీ, డేట్ చెప్పలేదు. మరోవైపు ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారు అనే వాదన కూడా నడుస్తోంది. ఎందుకంటే సెన్సార్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే బావుంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్తున్నారు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ జరిగితే కొద్ది రోజులు రెంట్ బేసిస్ మీద పెడతారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నేరుగా ఓటీటీ కాకుండా.. థియేటర్ రిలీజ్ జరిగితే మాత్రం మూవీ విడుదలైన 2 వారాలకు మంకీ మ్యాన్ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది అంటున్నారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లోకే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి వచ్చిన క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది. అందుకే ఇండియన్ ఆడియన్స్ కూడా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా దేవ్ పటేల్ చేయడం విశేషం. అలాగే ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా దేవ్ పటేల్. అతని టేకింగ్ కి, కథకి, మూవీలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కి ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి మరిన్ని సినిమాలతో దేవ్ పటేల్ ప్రేక్షకుల ముందుకు రావాలంటూ కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి