iDreamPost

ప్రియుడిపై ప్రేమ.. పొరుగింటి వాడిపై కోరికలు.. OTTలో ఈ మూవీకి పిచ్చెక్కుతుంది!

OTT Suggestions Best Watch Alone Movie: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఈ మూవీ మాత్రం మీకు బుర్రపాడు చేసేస్తుంది. పక్కింట్లోకి తొంగిచూస్తే పర్వావసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో చూడచ్చు.

OTT Suggestions Best Watch Alone Movie: ఓటీటీలో మీరు ఇప్పటివరకు చాలానే సినిమాలు చూసుంటారు. కానీ, ఈ మూవీ మాత్రం మీకు బుర్రపాడు చేసేస్తుంది. పక్కింట్లోకి తొంగిచూస్తే పర్వావసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో చూడచ్చు.

ప్రియుడిపై ప్రేమ.. పొరుగింటి వాడిపై కోరికలు.. OTTలో ఈ మూవీకి పిచ్చెక్కుతుంది!

ఓటీటీలో కొన్ని సినిమాలు చూస్తే మైండ్ లోనుంచి పోవు. అలాంటి ఒక క్రేజీ డ్రామా మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కచ్చితంగా నోరెళ్లబెట్టేస్తారు. పైగా ఈ మూవీలో కాస్త వైలెన్స్, కాస్త ప్రేమ, కాస్త ఎక్కువగానే రొ*మ్యాన్స్ ఉంటుంది. ఈ సినిమా నిజానికి హాలీవుడ్ లో వచ్చింది. కానీ, కథ మాత్రం మనకు బాగా యాప్ట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు పక్కింట్లో ఏం జరుగుతోంది? పక్కింటి ఆయన భార్య మీద అరిశాడా? ఇలాంటి ఆతుతర మనవాళ్లకి బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే అలా చేయడం ఎంత ప్రమాదం అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. పైగా కాస్త ఘాటుగానే చెప్పారు.

సాధారణంగా పక్కింట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసుకోవాలి అని ఉంటుంది. అలాగే కొత్తగా ఇల్లు మారిన ఈ జంటకు కూడా పక్కింట్లో ఏం జరుగుతుంతో చూడాలి అనిపిస్తుంది. నిజానికి అందులో వారి తప్పు ఏం లేదు. ఎందుకంటే అద్దాలు భవనంలో ఉన్నప్పుడు కర్టన్స్ వేసుకుని ఏ పని అయినా చేయాలి. అలాంటిది వాళ్లు కర్టన్ వేయడం సంగతి పక్కన పెట్టి ఒంటి మీద ఉన్నవే తీసేసి తెగ రెచ్చిపోతారు. ఈ కొత్త ప్రేమజంట కూడా మొదటిసారి కాస్త ఆసక్తిగానే చూస్తారు. ఆ తర్వాత అది వారికి అలవాటు అయిపోతుంది. అయితే అతను పెళ్లైన వ్యక్తి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. కానీ, రోజుకు ఒక యువతితో అతను తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తన భార్యకు కూడా తెలియడం ఇక్కడ కొసమెరుపు.

వాళ్ల కాపురం అలా సాగుతూ ఉంటే. ఈ కొత్త జంట మాత్రం వారిని రోజూ గమనిస్తూ ఉంటుంది. అంతేకాకుండా.. కొన్నిరోజులకు ఈ అమ్మాయి ప్రియుడిపై కాకుండా.. పక్కింటి వాడిపై మనసు పారేసుకుంటుంది. అతనిపై ఈమెకు కోరికలు స్టార్ట్ అవుతాయి. ఇంకేముంది అసలు కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. అద్దాల మేడలో కనిపించేదంతా నిజంకాదు.. అసలు కథ వేరుంటది అని క్లారిటీ వస్తుంది. కానీ, ఈ అమ్మడు మాత్రం అతనిపై కోరికలు అలాగే ఉంచుకుంటుంది. అది ఎంత వరకు వెళ్లాయి? అసలు అతని నిజ స్వరూపం ఏంటి? వేరే వాళ్లతో తిరుగుతున్నా కూడా ఆ భార్య ఎందుకు అడ్డు చెప్పదు అనేదే అసలు కథ. ఇంక పక్కింటి ఆయనపై కోరికలు పెంచుకుని తన ప్రియుడిని ఏం చేసింది? అనేది అసలు పాయింట్. అయితే ఈ సినిమాలో కాస్త బో*ల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఈ మూవీ పేరు ‘ది వాయర్స్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒంటరిగా చూస్తే బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి