iDreamPost

OTTలో మస్ట్ వాచ్ యూత్ ఎంటర్టైనర్.. ఒక్కో సీన్ ఒక డైమండ్!

  • Published Jun 15, 2024 | 4:42 PMUpdated Jun 15, 2024 | 4:42 PM

OTT Best Youthfull Entertainer: ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చూడాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే . సోషల్ మీడియాలో బాగా ఆ సినిమాకు సంబంధించిన సీన్స్ ట్రెండ్ అయ్యేవరకు.. ఈ సినిమా గురించి ఎవరికీ తెలీదు. మరి ఈ సినిమా ఏంటో తెలుసుకుందాం.

OTT Best Youthfull Entertainer: ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చూడాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే . సోషల్ మీడియాలో బాగా ఆ సినిమాకు సంబంధించిన సీన్స్ ట్రెండ్ అయ్యేవరకు.. ఈ సినిమా గురించి ఎవరికీ తెలీదు. మరి ఈ సినిమా ఏంటో తెలుసుకుందాం.

  • Published Jun 15, 2024 | 4:42 PMUpdated Jun 15, 2024 | 4:42 PM
OTTలో మస్ట్ వాచ్ యూత్ ఎంటర్టైనర్.. ఒక్కో సీన్ ఒక డైమండ్!

హర్రర్ , సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే అందరికి ఇష్టమే. కానీ ఎప్పుడు అవే చూడాలంటే మాత్రం ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. కాస్త అప్పుడప్పుడు వాటి నుంచి బ్రేక్ తీసుకుని.. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ను చూడాలని అనుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. ఎందుకంటే ఇలానే సినిమాలలో మాత్రమే లవ్ , రొ*మాన్స్ లాంటి యాంగిల్స్ ఉంటాయి కాబట్టి.. ఎక్కువ మంది యూత్ ఇలాంటి సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “మాయలో”. ఈ సినిమాకు మెఘా మిత్ర పెర్వార్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో నరేష్ అగస్త్య, భావన వజపాండల్, జ్ఞానేశ్వరి కండ్రేగుల ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇప్పుడున్న జనరేషన్ యూత్ అంతా కూడా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. కాస్త బో*ల్డ్ కంటెంట్ ఉన్న డైలాగ్స్ తో సినిమా కాస్త అటు ఇటుగా ఘాటుగానే సాగుతుంది. చాలా వరకు సీన్స్ అన్నీ కూడా ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అద్దం పట్టేలానే ఉంటాయి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. నరేష్ అగస్త్య, భావన , జ్ఞానేశ్వరి కండ్రేగుల వీరు ముగ్గురు కూడా చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్. తానూ ప్రేమించిన పాల్ ను పెళ్లి చేసుకోవాలని జ్ఞానేశ్వరి నిర్ణయించుకుంటుంది. తన పెళ్ళికి రావాలని మిగిలిన ఇద్దరినీ పిలుస్తుంది. అయితే జ్ఞానేశ్వరి పెళ్లికి వెళ్లకూడదని నరేష్ అగస్త్య బామ్మా అభ్యంతరం చెప్తుంది. అయినా సరే వారిద్దరూ కలిసి కార్ లో వారి ఫ్రెండ్ పెళ్లికి బయలుదేరుతారు. అసలు వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఏంటి ! నరేష్ అగస్త్య బామ్మా ఎందుకు వద్దంటుంది ! వద్దన్నా వెళ్లిన వారి ప్రయాణం ఎలా సాగింది ! జ్ఞానేశ్వరికి ఆమె కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగిందా లేదా ! ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి