iDreamPost

OTTలో మూడు తరాల కథ.. ప్రతి మహిళ తప్పక చూడాల్సిన సిరీస్..

  • Published Jun 14, 2024 | 5:04 PMUpdated Jun 14, 2024 | 5:04 PM

Best Feel Good Movie In OTT: ఓటీటీ లో ఇప్పుడు వస్తున్న సినిమాలను, సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. ఇక వెబ్ సిరీస్ ల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

Best Feel Good Movie In OTT: ఓటీటీ లో ఇప్పుడు వస్తున్న సినిమాలను, సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూస్తున్నారు మూవీ లవర్స్. ఇక వెబ్ సిరీస్ ల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ ను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

  • Published Jun 14, 2024 | 5:04 PMUpdated Jun 14, 2024 | 5:04 PM
OTTలో మూడు తరాల కథ.. ప్రతి మహిళ తప్పక  చూడాల్సిన సిరీస్..

వెబ్ సిరీస్ లంటే ఇష్టపడని వారు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి వెబ్ సిరీస్ లోను.. ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్ట్ లు, కథలో మలుపులు ఉంటాయి. దీనితో ఇప్పుడు వెబ్ సిరీస్ లపై అందరికి మరింత ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను మిస్ చేసి ఉంటె మాత్రం .. ఓ మంచి ఫీల్ గుడ్ సిరీస్ ను మిస్ అయినట్లే. ఎందుకంటే ఇప్పటివరకు చూసిన వెబ్ సిరీస్ లల అయితే ఈ వెబ్ సిరీస్ ఉండదు. మంచి రెఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ పేరు “స్వీట్ కారం కాఫీ”. ఈ సిరీస్ లో లక్ష్మీ, మధుబాల, శాంతి బాలచంద్రన్, కెవిన్ జయ్ బాబు, వంశీ కృష్ణ లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ వెబ్ సిరీస్ ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాల కథ. అత్తయిన 60 ఏళ్ళ బామ్మ , అమ్మయినా 40 ఏళ్ళ మహిళ, ఇక వారికి కూతురు, మనవరాలు గా 20 ఏళ్ళ యువతి. వారి అనుభవాలు, ఆలోచనలు , ఆశయాలతో వారు ముగ్గురు కలిసి ఎలా ప్రయాణం చేశారు. అనేదే ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ ప్రస్తుతానికైతే తమిళంలో మాత్రమే ఉంది. ఇప్పుడు అన్ని లాంగ్వేజ్స్ కు సంబంధించిన సినిమాలను, సిరీస్ లను ఎలాగూ ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ సిరీస్ చూడడానికి అంత ఇబ్బంది అయితే ఉండదు. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Sweet kaaram coffee

సుందరి అనే అరవై ఏళ్ళ బామ్మ.. తన భర్త మరణించడంతో.. కొడుకు రాజారత్నం ఇంట్లోనే ఉంటుంది. రాజా రత్నంకు భార్య కావేరి, కొడుకు బాల , కూతురు నివేదిత ఉంటారు. సుందరి ఇంట్లోనే ఉంటే.. కావేరి మాత్రం ఇంటి పనులు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. బాల సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటె.. నివేదిత క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఓ రోజు సుందరి, కావేరి, నివేదిత కలిసి ఇంట్లో చెప్పకుండా గోవా ట్రిప్ ప్లాన్ చేసి వెళ్తారు. ముగ్గురు ఆడవాళ్ళూ ఆ ట్రిప్ కు ఎందుకు వెళ్లారు ! గోవా ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది ! వాళ్ళు ఏ ఏ ప్లేస్ లకు వెళ్లారు ! ఆ ముగ్గురి గతం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి