iDreamPost

క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా దెయ్యాలే.. OTTలో ఒక్కో సీన్ కి చెమటలు పట్టేస్తాయి!

  • Published Jun 15, 2024 | 3:32 PMUpdated Jun 15, 2024 | 3:32 PM

OTT Best Horror Movie : ఓటీటీ లో ఇప్పటివరకు ఇలాంటి బెస్ట్ హర్రర్ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. పైగా కొరియన్ ఘోస్ట్ స్టోరీస్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Movie : ఓటీటీ లో ఇప్పటివరకు ఇలాంటి బెస్ట్ హర్రర్ సినిమాను మాత్రం అసలు చూసి ఉండరు. పైగా కొరియన్ ఘోస్ట్ స్టోరీస్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 15, 2024 | 3:32 PMUpdated Jun 15, 2024 | 3:32 PM
క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా దెయ్యాలే.. OTTలో ఒక్కో సీన్ కి చెమటలు పట్టేస్తాయి!

ప్రత్యేకించి హర్రర్ సినిమాలకు మాత్రం కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. దాదాపు ఓటీటీ లో ఉన్న అన్ని హర్రర్ సినిమాలను కూడా వచ్చినవి వచ్చినట్లు కవర్ చేస్తూ ఉంటారు హర్రర్ మూవీ లవర్స్. అయితే అన్ని సినిమాలను చూసేసాం అని అనుకునే వారికి ఇంకా కొన్ని హర్రర్ సినిమాలు చూసేందుకు బ్యాలన్స్ ఉన్నాయంటూ.. గుర్తు చేస్తుంటాయి కొన్ని సినిమాలు . పైగా ఈ హర్రర్ సినిమాలలో కొరియన్ హర్రర్ కథలంటే ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ కొరియన్ హర్రర్ స్టోరీనే.. మరి ఈ సినిమాను మీరు చూసారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. ఈ సినిమాలో జెన్నిఫర్ అనే మహిళ ఓ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. కానీ, ఆమె అక్కడికి వెళ్ళగానే ఆ స్కూల్ అంతా ఖాలీగా కనిపిస్తుంది. ఎందుకు స్కూల్ అంతా ఖాళీగా ఉందని.. అక్కడే ఉన్న క్రిస్సీ అనే స్టూడెంట్ ను అడుగగా.. లంచ్ బ్రేక్ అని చెప్తుంది. ఆ తర్వాత జెన్నిఫర్ ను స్టాఫ్ రూమ్ కు తీసుకుని వెళ్తుంది. ఇక ఆమె ఆ స్కూల్ లో హిస్టరీ టీచర్ గా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత రోజు జెన్నీ స్కూల్ కి వస్తుంది . అక్కడ తన క్లాస్ రూమ్ వెతుక్కోడానికి ఇబ్బంది పడుతుంటే .. మళ్ళీ క్రిస్సీ తనకు సహాయం చేస్తుంది. ఆ క్లాస్ కు వెళ్లి చూస్తే.. పిల్లలంతా అల్లరి చేస్తూ ఉంటారు. జెన్నీ అవేమి పట్టించుకోకుండా.. క్లాస్ చెప్తూ ఉంటుంది.

అయితే అప్పటికే జెన్నీ తన రిలేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే జెన్నీ బాయ్ ఫ్రెండ్ అందరి ముందు.. జెన్నీ కాళ్ళు పట్టుకుని తనని బాగా ఇబ్బంది పెడతాడు, ఇదిలా ఉంటె నెక్ట్ డే జెన్నీ మళ్ళీ స్కూల్ కి వెళ్లగా.. అక్కడ క్రిస్సీని ఫాలో అయినా జెన్నీకి భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఎదురౌతుంది. దింతో ఆ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళడానికి కూడా జెన్నీ భయపడుతుంది. వేరే టీచర్ కాల్ చేస్తే.. అప్పుడు స్కూల్ కి వెళ్లి తన క్లాస్ లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని.. ఆమెకు జరిగిందంతా చెప్తుంది. అసలు అలాంటి క్లాస్ ఏ లేదని.. ఆ టీచర్ చెప్తుంది. దింతో జెన్నీకి కొత్త భయాలు స్టార్ట్ అవుతాయి.

కొన్నేళ్ల క్రితం అదే క్లాస్ లో ఓ స్టూడెంట్ పెట్రోల్ పోసి తన తోటి స్టూడెంట్స్ ను హత్య చేశాడని.. అప్పుడు ఇద్దరు టీచర్స్ కూడా చనిపోయారని .. ప్రిన్సిపాల్ చెప్పడంతో.. ఇంకాస్త భయం పెరుగుతుంది. అయినా సరే ఆ నెక్ట్ డే మళ్ళీ ఆ క్లాస్ కు వెళ్తుంది. అక్కడ ఆ స్టూడెంట్స్ అంతా దెయ్యాలుగా కనిపిస్తారు. అక్కడినుంచి పారిపోదాం అన్నా కూడా అవ్వదు. ఆ తర్వాత ఏం జరిగింది! అసలు స్టూడెంట్స్ దెయ్యాలుగా మారడం ఏంటి ! ఇంతకు క్రిస్సీ దెయ్యమా ! మనిషా ! జెన్నీ ఈ సమస్యల నుంచి ఎలా తప్పించుకుంది ! ఇవన్నీ తెలియాలంటే “హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి