iDreamPost

15 రోజుల నుంచి OTT ని షేక్ చేస్తున్న హారర్ మూవీ.. ఇంకా చూడలేదా?

  • Published Jun 15, 2024 | 4:13 PMUpdated Jun 15, 2024 | 4:13 PM

Best Horror Movie In OTT: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె కనుక .. ఇప్పటికే ఈ సినిమాను చూసేసి ఉంటారు. ఒకవేళ చూడలేదంటే మాత్రం ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

Best Horror Movie In OTT: హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటె కనుక .. ఇప్పటికే ఈ సినిమాను చూసేసి ఉంటారు. ఒకవేళ చూడలేదంటే మాత్రం ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 15, 2024 | 4:13 PMUpdated Jun 15, 2024 | 4:13 PM
15 రోజుల నుంచి OTT ని షేక్ చేస్తున్న హారర్ మూవీ.. ఇంకా చూడలేదా?

హర్రర్ సినిమాలను ఇష్టపడని వారు ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకంటే ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కుర్చోపెడుతూ.. తర్వాత ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ను ఇస్తూ ఉంటాయి. దీనితో ఇప్పుడు మేకర్స్ కూడా హర్రర్ జోనర్ లో వస్తున్న సినిమాలను చాలా జాగ్రత్తగా.. మంచి స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓటీటీ లోకి ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ .. ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉంటే కనుక ఇప్పటికే ఈ సినిమాను చూసేసి ఉంటారు. ఒకవేళ చూడలేదంటే కనుక ట్విస్ట్స్ తో ఉన్న ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చుసేద్ద్దాం.

హర్రర్ జోనర్ సినిమాలకు స్పెషల్ అటెన్షన్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి. అందుకే ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా పక్కా హిట్ అవుతాయి. ఇక హాలీవుడ్ లో ఈ జోనర్ లో అనేక రకాల సినిమాలు, అందులో ఫ్రాంఛైజీలు ఇలా చాలానే వచ్చాయి. వాటిలో ఒమెన్ ఫ్రాంఛైజీ లో భాగంగా.. ది నన్, కంజూరింగ్ , ఇన్సీడియస్, గ్రడ్జ్ , ఈవిల్ డెడ్ ఇలాంటి సినిమాలు లెక్కలేనన్ని వచ్చాయి. ది ఉమెన్ టైటిల్ తో 1976 లో మొదటి సినిమా రిలీజ్ కాగా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇలా దీనిలో వరుసగా ఆరు సినిమాల తర్వాత ఇప్పుడు ది ఫస్ట్ ఒమెన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మే 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక ఫస్ట్ ఒమెన్ సినిమా కథ విషయానికొస్తే.. . ‘ది ఓమెన్’లో అసలు హారర్‌కు రీజన్ అయిన బేబీ ఎలా పుట్టింది అనేది.. ‘ది ఫస్ట్ ఓమెన్’ మూవీలో చూపించారు. అసలు మొత్తంగా రోమ్ లో ఏం జరిగింది ! ది ఒమెన్ అనే కాన్సెప్ట్ ఎలా మొదలయ్యింది. అనేది ఈ సినిమాలో చూసేయొచ్చు. ది ఫస్ట్ ఒమెన్ మూవీ నీట్ గా అర్ధం అవ్వాలంటే మాత్రం.. ఆల్రెడీ దానికంటే ముందు వచ్చిన ది ఒమెన్ మూవీని చూడాల్సిందే. దాదాపు ఈ సినిమా హాట్ స్టార్ లోకి వచ్చి పదిహేను రోజులు అయిపొయింది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం.. ట్విస్ట్స్ తో ఉన్న ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి