iDreamPost

డిగ్రీ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. నెలకు 1,40,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

డిగ్రీ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. నెలకు 1,40,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్

ప్రస్తుత రోజుల్లో డిగ్రీ అర్హతతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అయితే ప్రైవేట్ సెక్టార్ లో శాలరీ తక్కువ, ఒత్తిడితో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే యువత డిగ్రీలు పూర్తి చేసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా డిగ్రీ పాసై గవర్నమెంట్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,40,000 అందుకోవచ్చు.

నిరుద్యోగులకు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీపి కబురును అందించింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 214 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 02 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 214.

విభాగాలవారీగా ఖాళీలు:

  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01
  • అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 01
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కెటింగ్‌): 11
  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అకౌంట్స్‌): 20
  • జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌: 120
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌): 20
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): 40
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 01

అర్హత:

పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

పోస్టులను అనుసరించి అభ్యర్థులు 30-32 ఏళ్ల వయసును కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

జీతం:

నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

12-06-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

02-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి